Rithu Chowdary Gives Clarity on Bigg Boss Entry
Rithu Chowdary : బిగ్ బాస్ లోకి సీరియల్స్, టీవీ షోలు, సోషల్ మీడియాలో పాపులర్ అయినవాళ్లనే ఎక్కువగా తీసుకుంటారు. ఈ క్రమంలో పలు సీరియల్స్, జబర్దస్త్, టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి గతంలో బిగ్ బాస్ కి వెళ్తుంది అనుకున్నారు. రీతూ క్లోజ్ ఫ్రెండ్ విష్ణుప్రియ కూడా బిగ్ బాస్ కి వెళ్లడంతో రీతూ కూడా వెళ్తుందని భావించారు.
తాజాగా రీతూ చౌదరిని ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ కి వెళ్తారా అని అడగ్గా.. నేను అక్కడికి వెళ్తే వాళ్ళు అడిగేది నాకు గుర్తుండదు, అక్కడికి వెళ్తే నేనేం చేస్తానో నాకు తెలీదు, అంత కన్ఫ్యూజన్ నాకు. లాస్ట్ రెండు సీజన్స్ నేను వెళ్తాను అని రూమర్స్ వచ్చాయి అంతే. నేను వెళ్తానో లేదో తెలీదు. కానీ వాళ్ళు పిలిచి మీ అవసరం ఉంది, మీరు షోకి రావాలి అని అడిగితే నేను వెళ్లే ఛాన్స్ ఉంది అని తెలిపింది. దీంతో బిగ్ బాస్ నుంచి పిలుపు వస్తే రీతూ వెళ్తాను అని డైరెక్ట్ గానే చెప్పేసింది. మరి రాబోయే సీజన్స్ లో రీతూ బిగ్ బాస్ కి వెళ్తుందా లేదా చూడాలి.
Also Read : Rithu Chowdary : రీతూ చౌదరి పేరు ఎందుకు మార్చుకుంది? ఎప్పుడు మార్చుకుంది? అసలు పేరేంటో తెలుసా?