Rithu Chowdary : అతనివల్ల మోసపోయాను.. డబ్బులు నష్టపోయాను.. రీతూ చౌదరి సంచలన వీడియో..
తాజాగా ఓ వ్యక్తి చేతిలో మోసపోయాను అంటూ, డబ్బులు నష్టపోయాను అంటూ సంచలన వీడియో షేర్ చేసింది రీతూ చౌదరి.
![Rithu Chowdary : అతనివల్ల మోసపోయాను.. డబ్బులు నష్టపోయాను.. రీతూ చౌదరి సంచలన వీడియో.. Rithu Chowdary : అతనివల్ల మోసపోయాను.. డబ్బులు నష్టపోయాను.. రీతూ చౌదరి సంచలన వీడియో..](https://10tv.in/wp-content/uploads/2023/10/rithu-chowdary.jpg)
Rithu Chowdary shared a sensational video saying she was cheated by a man and lost money
Rithu Chowdary : సీరియల్స్(Serials) తో ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి ఆ తర్వాత జబర్దస్త్(Jabardasth), యూట్యూబ్(You Tube) వీడియోలతో పాపులారిటీ తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా రీల్స్, హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంది. తన ప్రేమ, పెళ్లి రూమర్స్ తో కూడా వైరల్ అయింది రీతూ. ఇటీవల కొన్నాళ్ల క్రితం రీతూ వాళ్ళ నాన్న మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి చేతిలో మోసపోయాను అంటూ, డబ్బులు నష్టపోయాను అంటూ సంచలన వీడియో షేర్ చేసింది.
రీతూ చౌదరి తన వీడియోలో.. ఆరు నెలల క్రితం ఓ ఇంటిని కొన్నాను. అప్పుడు ఇంటీరియర్ వర్క్స్ చేయమని ఒకరికి వర్క్ ఇచ్చాను. అతను 5 లక్షలు తీసుకున్నాడు. ఇంతలో మా నాన్న చనిపోయారు. ఇంటి వర్క్ పూర్తవ్వలేదు. దీంతో అతన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పట్లేదు. అడిగితే మమ్మల్నే అనరాని మాటలు అన్నాడు. అతని వల్ల నేను చాలా మోసపోయాను. ఓ పక్క నాన్న మరణించి నేను బాధలో ఉన్నాను. మరో పక్క ఇష్టపడి కొనుక్కున్న ఇల్లు వర్క్ పూర్తవ్వలేదు, డబ్బులు కూడా పోయాయి. దీంతో పోలీసులని ఆశ్రయించాను. పోలీసుల ఒత్తిడితో అతను కొంచెం డబ్బు తిరిగి ఇచ్చాడు. వీటన్నిటితో నేను మానసికంగా చాలా బాధపడ్డాను. ఇప్పుడు ఇంటీరియర్ వర్క్ వేరేవాళ్లకి అప్పగించాను. నేను పడ్డ బాధ పడకూడదని ఈ విషయాన్ని అందరికి తెలియచేస్తున్నాను అని తెలిపింది.
అలాగే.. అతనికి పని ఇవ్వకండి, అతన్ని నమ్మకండి, ఇలాంటివాళ్లతో జాగ్రత్తగా ఉండండి అంటూ తనని మోసం చేసిన వ్యక్తి ఫోటో, ఆ వ్యక్తి ఇంటీరియర్ కంపెనీ వివరాలు కూడా ఆ వీడియోలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.