Robinhood
హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న రాబిన్ హుడ్ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. మార్చి 28న ఈ సినిమా విడుదల కానుంది.
రాబిన్ హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఇవాళ హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా క్రికెటర్ డేవిడ్ వార్నర్ వచ్చాడు. ఇందులోనే ఈ సినిమా ట్రైలర్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది.
కాగా, ఈ సినిమా ద్వితీయార్థంలో డేవిడ్ వార్నర్ పాత్ర ఉంటుందని ఇప్పటికే సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ ట్రైలర్‌లో డేవిడ్ వార్నర్‌ను కూడా చూపించారు. అతడె హెలికాప్టర్ నుంచి దిగుతూ లాలీపాప్ తింటూ నడుస్తూ వచ్చిన సీన్ ఇందులో చూడొచ్చు. పలు కామెడీ, యాక్షన్ సీన్లను కూడా ట్రైలర్‌లో చూపించారు.
నితిన్, వెంకీ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. ఇందులో శ్రీలీల హీరోయిన్. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నితిన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా రూపుదిద్దుకుంది.