Roja
Roja : ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలు చేసింది. దాదాపు 125 పైన సినిమాలు చేసిన రోజా రాజకీయాల్లోకి రావడంతో సినిమాలు మానేసినా జబర్దస్త్ టీవీ షోతో అందరికి అందుబాటులో ఉండేది. గత ప్రభుత్వంలో మంత్రి అయ్యాక జబర్దస్త్ కూడా వదిలేసింది. దీంతో రోజా ఇక సినిమాలు, టీవీ షోలలో కనపడదు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారడంతో రోజా మళ్ళీ పరిశ్రమలో బిజీగా మారుతుంది.(Roja)
ఆల్రెడీ తెలుగు టీవీ షోలలో జడ్జిగా, గెస్ట్ గా పలు షోలకు హాజరవుతుంది రోజా. టీవీ షోలలో రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సినిమాలోకి కూడా రీ ఎంట్రీ ఇస్తుంది. తెలుగులో చివరగా 2013 లో, తమిళ్ లో చివరగా 2015 లో రోజా సినిమాలు వచ్చాయి అప్పట్నుంచి రోజా సినిమాలకు దూరంగానే ఉంది.
Also Read : The Great Pre Wedding Show : ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ రివ్యూ.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..
తాజాగా తమిళ్ లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ లో DD బాలచంద్రన్ దర్శకత్వంలో లెనిన్ పాండ్యన్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రోజా కీలక పాత్రలో నటిస్తుంది. రోజా చాన్నాళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తుంది అంటూ స్పెషల్ వీడియోని ఖుష్భూ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఒకప్పటి స్టార్, 90s క్వీన్ రోజా రీ ఎంట్రీ ఇస్తుంది అంటూ.. ఆమె పాత సినిమాలకు సంబంధించిన కొన్ని క్లిప్స్ ని చూపిస్తూ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్న సినిమాలోని కొన్ని సీన్స్ ని చూపిస్తూ స్పెషల్ వీడియోగా కట్ చేసారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
లెనిన్ పాండ్యన్ సినిమా నుంచి వచ్చిన రోజా స్పెషల్ రీ ఎంట్రీ వీడియో చూస్తే రోజా డీ గ్లామర్ పాత్రలో నటించబోతుందని తెలుస్తుంది. వయసైపోయి, బాధపడుతున్న ఓ పెద్దావిడ లుక్స్ లో రోజా కనిపించింది. మరి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి రోజా మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తుందా చూడాలి.
Also See : Khushi Kapoor : జాన్వీ కపూర్ చెల్లి, ఖుషి కపూర్ పుట్టిన రోజు వేడుకలు.. ఫొటోలు..