Roja Selvamani special selfie with Mahesh Babu in a wedding goes Viral
Roja Selvamani : ఘట్టమనేని ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. మహేష్ బాబు దగ్గరి బంధువు అయిన ఘట్టమనేని వరప్రసాద్-అపర్ణల కూతురు డాక్టర్ దామిని వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ డాక్టర్స్ సునీల్ – రాధిక దంపతుల తనయుడు డాక్టర్ సేతు సందీప్ తో దామిని వివాహం నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్ లో జరగగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Gautam Ghattamaneni : మహేష్ తనయుడు గౌతమ్.. ఫ్యామిలీతో బర్త్‌డే సెలెబ్రేషన్స్ వీడియో చూశారా?
అయితే బంధువుల వివాహ వేడుక కావడంతో ఈ పెళ్ళికి మహేష్ బాబు కూడా విచ్చేశాడు. అలాగే సీనియర్ నటి, ఏపీ మంత్రి రోజా కూడా ఈ పెళ్ళికి విచ్చేసింది. దీంతో రోజా మహేష్ లు కాసేపు ముచ్చటించారు. రోజా మహేష్ బాబుతో సెల్ఫీ తీసుకుంది. అలాగే మహేష్ బాబుతో ఫోటో దిగింది. నూతన జంటతో పాటు మహేష్ తో దిగిన సెల్ఫీ కూడా రోజా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ సెల్ఫీ ఫోటో వైరల్ గా మారింది.