Romantic Song from Pawan Kalyan OG movie on SEP 2nd
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ఓజీ (OG) మూవీ. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే పవన్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఓజీ సినిమా నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేయాలనుకుంటున్నారట. ఈ సాంగ్‌లో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటించారని అంటున్నారు.
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఈ రొమాంటిక్ ట్రాక్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఉంటుందని టాక్. గతేడాది పవన్ బర్త్‌డే సందర్భంగా హంగ్రీ చీతా గ్లింప్స్ రిలీజ్ చేసి మూవీపై హైప్ పెంచారు. ఈసారి రొమాంటిక్ సాంగ్‌తో మరో ట్రీట్ ఇవ్వాలని భావిస్తోందట టీమ్.
Parag Tyagi : ఆమె మరణం.. తట్టుకోలేక గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్న నటుడు..
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సాంగ్‌కు అదిరిపోయే ట్యూన్స్ అందించారని, ఇది ఫ్యాన్స్‌కు కచ్చితంగా నచ్చేలా ఉంటుందని గాసిప్స్ షికారు చేస్తున్నాయి. థమన్ మార్క్ మెలోడీతో పాటు పవన్ లుక్, ప్రియాంకతో కెమిస్ట్రీ ఈ పాటను హైలైట్ చేస్తాయని టాక్. ఓజీ సినిమా ముంబై నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్నప్పటికీ, ఈ రొమాంటిక్ సాంగ్ సినిమాకు ఓ ఎమోషనల్ టచ్ జోడిస్తుందని అంటున్నారు.
సెప్టెంబర్ 2న ఈ పాట రిలీజ్ అయితే, అభిమానులకు ఫుల్ జోష్ నింపడం ఖాయమని సినీ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఇక ఓజీ టీమ్ ఈ సాంగ్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోందని, ఈ ఈవెంట్‌ను సోషల్ మీడియాలో భారీగా ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్.
Thiruveer : తండ్రి కాబోతున్న హీరో.. భార్యకు ఘనంగా సీమంతం..
పవన్ కల్యాణ్ పొలిటికల్ బిజీ షెడ్యూల్ మధ్య కూడా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది, ఈ రొమాంటిక్ సాంగ్‌తో పాటు, సినిమా నుంచి మరో టీజర్ లేదా పోస్టర్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ సాంగ్ ఫ్యాన్స్‌కు మంచి బర్త్‌డే బొనాంజాగా ఉంటుందని అంటున్నారు.