Parag Tyagi : ఆమె మరణం.. తట్టుకోలేక గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్న నటుడు..
బాలీవుడ్ ఫేమస్ నటి షెఫాలీ జరివాలా ఇటీవల జూన్ లో 42 ఏళ్ళ వయసులోనే షెఫాలీ జరివాలా ఆకస్మికంగా మరణించింది. (Parag Tyagi)

Parag Tyagi
Parag Tyagi : బాలీవుడ్ ఫేమస్ నటి షెఫాలీ జరివాలా ఇటీవల జూన్ లో మరణించిన సంగతి తెలిసిందే. కాంటా లగా అనే పాటతో దేశమంతా వైరల్ అయింది షెఫాలీ జరివాలా. 42 ఏళ్ళ వయసులోనే షెఫాలీ జరివాలా ఆకస్మికంగా మరణించింది. దీంతో ఆమె భర్త, నటుడు పరాగ్ త్యాగి(Parag Tyagi) తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.
పరాగ్ త్యాగీ తన భార్య షెఫాలీ జరివాలా అంత్యక్రియల రోజు కూడా భార్య మృతుదేహాన్ని పట్టుకొని భోరున విలపించాడు. ఆమె మరణం పరాగ్ త్యాగిని తీవ్ర శోక సంద్రంలో ముంచేసింది. భార్య లేకుండా పరాగ్ చాలా కష్టంగా బతుకుతున్నాడు. ఈ క్రమంలో పరాగ్ త్యాగి తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
Also Read : Thiruveer : తండ్రి కాబోతున్న హీరో.. భార్యకు ఘనంగా సీమంతం..
పరాగ్ త్యాగి మరణించిన తన భార్య షెఫాలీ జరివాలా చిత్రాన్ని తన గుండెలపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. తన భార్య రూపాన్ని గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసి.. మా 15వ యానివర్సరీకి ఆమెకు గిఫ్ట్ ఇదే. ఆమె ఎప్పుడూ నా హృదయంలో ఉంటుంది. నా శరీరంలోని ప్రతి కణంలో ఆమె నిండి ఉంటుంది. ఇప్పుడు అది అందరూ చూడొచ్చు అని తెలిపాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారగా భార్యపై అతనికున్న ప్రేమకు హ్యాట్సాఫ్ అంటున్నారు జనాలు.