Roopa Koduvayur : మానసిక వైకల్యం ఉన్న బాలికల కోసం హీరోయిన్.. పీరియడ్స్ పై అవగాహన కల్పిస్తూ..

తాజాగా రూప కొడువాయూర్ ఓ చిన్న గ్రామానికి వెళ్లి అక్కడ మానసిక వైకల్యం ఉన్న బాలికలకు, వారి తల్లి తండ్రులకు పీరియడ్స్ పై అవగాహన కల్పించి ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ అందచేసింది.

Roopa Koduvayur Conducts A Program on Menstrual Health to Mentally Disabled Girls and Their Parents

Roopa Koduvayur : తెలుగమ్మాయి రూప కొడువాయూర్ హీరోయిన్ గా ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, మిస్టర్ ప్రగ్నెంట్ సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం ప్రియదర్శితో ఓ సినిమా, తమిళ్ లో ఓ సినిమా చేస్తుంది. అయితే రూప కొడువాయూర్ డాక్టర్ కూడా. క్లాసికల్ డ్యాన్సర్ కూడా. వృత్తిరీత్య డాక్టర్ అయిన రూప సినిమాల్లోకి వచ్చి హీరోయిన్ గా చేస్తున్నా డాక్టర్ గా కూడా పనిచేస్తుంది. అప్పుడప్పుడు డాక్టర్ గా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది రూప కొడువాయూర్.

తాజాగా రూప కొడువాయూర్ ఓ చిన్న గ్రామానికి వెళ్లి అక్కడ మానసిక వైకల్యం ఉన్న బాలికలకు పీరియడ్స్ పై అవగాహన కల్పించి, వారి తల్లి తండ్రులకు కూడా పీరియడ్స్ పై అవగాహన కల్పించి ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ అందచేసింది. దీనికి సంబంధించిన వీడియో రూప కొడువాయూర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Also Read : Jabardasth : షాకింగ్ న్యూస్.. ఏకంగా జబర్దస్త్‌నే తీసేస్తున్నారు.. ఏడ్చేసిన రష్మీ, కుష్బూ, కంటెస్టెంట్స్..

రూప కొడువాయూర్ పీరియడ్స్ పై అవగాహన కల్పించిన ప్రోగ్రాం వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. హ్యాపీ పీరియడ్స్. పీరియడ్స్ గురించి ఫ్రీగా మాట్లాడే ప్రపంచాన్ని తయారుచేయాలి. ఎడ్యుకేషన్ ద్వారా పీరియడ్స్ పై అవగాహన కల్పించాలి. ఒక అమ్మాయికి పీరియడ్స్ సమయంలో ఆరోగ్యం తన మొత్తం ఫిజికల్, మెంటల్ హెల్త్ విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. పీరియడ్స్ పై వచ్చే అపోహల గురించి, ఆరోగ్యమైన, అసాధారణమైన పీరియడ్స్ గురించి వ్యత్యాసం తెలుసుకోవడం ముఖ్యం. నేను రెగ్యులర్ గా ఈ మానసిక వికాస్ NGO ని సందర్శిస్తాను అని మీకు తెలుసు. ఈ సంవత్సరం నేను ఇక్కడి పిల్లలకు, వారి తల్లితండ్రులకు పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత, ఆరోగ్యం గురించి, డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి.. ఇలాంటి పలు విషయాలపై వారికి తెలియచేసేందుకు ఒక అడుగు ముందుకు వేశాను. వారు ఎదుర్కునే సమస్యల గురించి, వారికి కావాల్సిన అవసరాల కోసం ఒక డాక్టర్ గా వారికి నేను బోధించడం ఛాలెంజింగ్ అనిపించింది. ఇది నేను ఎక్కువగా అధ్యయనం చేయని ప్రాంతం. ఇది గ్రామ ప్రాంతం ఇక్కడ అందరూ శానిటరీ ప్యాడ్స్ ని ఉపయోగించలేరు. వారికి శానిటరీ ప్యాడ్స్ అందించడం, వారి ఆరోగ్య నిర్వహణ మెరుగుపరచడం, వారికి పీరియడ్స్ పై పూర్తి అవగాహన కల్పించడం కోసం నా వంతు కృషి నేను చేస్తున్నాను అని తెలిపింది.

అలాగే.. చిన్న చిన్న విషయాలు నేర్చుకొని చిన్న చిన్న మార్పులు రేపు జీవితంలో పెద్ద మార్పుని తీసుకొస్తాయి. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు డాక్టర్ పాలడుగు పార్వతీదేవి, మానసిక వికాస కేంద్ర, ఇతర టీమ్ కి, దీని కోసం వచ్చిన తల్లితండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలుపుతూ పోస్ట్ చేసింది రూప కొడువాయూర్. దీంతో రూప కొడువాయూర్ పోస్ట్ వైరల్ గా మారగా అభిమానులు, పలువురు నెటిజన్లు ఆమెని అభినందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు