Roshan Meka: ఛాంపియన్‌గా మారుతున్న రోషన్.. బర్త్‌డేకు డబుల్ ట్రీట్ ఇచ్చిన యంగ్ హీరో!

టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా, హీరోగా, విలన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న శ్రీకాంత్ ప్రస్తుతం ఎలాంటి పాత్ర ఇచ్చినా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఇక ఆయన వారసుడిగా నిర్మలా కాన్వెంట్(2016) మూవీతో తెరంగేట్రం చేశాడు రోషన్. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రోషన్, తన నెక్ట్స్ మూవీగా కె.రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘పెళ్లిసందడి’లో హీరోగా నటించాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మంచి విజయాన్ని అందుకుంది.

Roshan Meka Announces His Next Projects On His Birthday

Roshan Meka: టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా, హీరోగా, విలన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న శ్రీకాంత్ ప్రస్తుతం ఎలాంటి పాత్ర ఇచ్చినా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఇక ఆయన వారసుడిగా నిర్మలా కాన్వెంట్(2016) మూవీతో తెరంగేట్రం చేశాడు రోషన్. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రోషన్, తన నెక్ట్స్ మూవీగా కె.రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘పెళ్లిసందడి’లో హీరోగా నటించాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మంచి విజయాన్ని అందుకుంది.

Roshan: పేరు మార్చుకున్న శ్రీకాంత్ కొడుకు.. ఇకనైనా కలిసొచ్చేనా?

అయితే ఆ తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని ఇంకా అనౌన్స్ చేయని రోషన్, తాజాగా తన బర్త్ డే సందర్భంగా అభిమానులు గుడ్ న్యూస్ చెప్పాడు. తన నెక్ట్స్ ప్రాజెక్టులను ఈ సందర్భంగా ఆయన అనౌన్స్ చేశాడు. ఈ యువ హీరో ఇప్పుడు వైజయంతీ మూవీస్ మరియు వేదాంష్ పిక్చర్స్ ప్రొడక్షన్స్‌లో తన తదుపరి సినిమాలతో రాబోతున్నాడు. వైదాంష్ పిక్చర్స్ బ్యానర్ తొలి ప్రొడక్షన్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రోషన్ లుక్ చాలా రిఫ్రెషింగ్‌గా కనిపిస్తుంది.

Roshan : రెండో చిత్రాన్ని గ్రాండ్‌గా ప్లాన్ చేసిన రోషన్..

అటు ప్రెస్టీజియస్ బ్యానర్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌లోనూ ఓ సినిమా చేయబోతున్నాడు రోషన్. ఈ సినిమాకు ‘ఛాంపియన్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైత్ డైరెక్ట్ చేయనుండటంతో ఈ సినిమాపై అంచనాలు అప్పుడే క్రియేట్ అవుతున్నాయి. ఇలా ఒకేరోజున రెండు సినిమాలను అనౌన్స్ చేసిన రోషన్, మున్ముందు ఈ సినిమాలకు సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఇస్తాడో చూడాలి.