RRR
RRR: ఇండియన్ సినిమా హిస్టరీలో మరో కొత్త అంకం ఆవిష్కృతం కానుంది. మరో తెలుగు సినిమా ఇండియన్ సినిమా స్థాయిని పెంచేలా బొమ్మ దద్దరిల్లడం ఖాయం. ఇది ఇప్పుడు సగటు తెలుగు ప్రేక్షకుడి మనోభావం. ఆ సినిమానే ఆర్ఆర్ఆర్. రీసెంట్ గా వచ్చిన గ్లిమ్ప్స్, లిరికల్ సాంగ్ తో తెలుగు ప్రేక్షకులలోనే కాకుండా యావత్ ఇండియన్ సినీ అభిమానులంతా ఇప్పుడు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అంతగా ఆర్ఆర్ఆర్ ప్రేక్షకులను ఓ మాయలోకి నెట్టేసింది.
RRR: యూట్యూబ్‌కి కూడా అందని మన హీరోల ‘నాటు’ డాన్స్ స్పీడ్!
ఆర్ఆర్ఆర్ ఇంతగా అటెన్షన్ క్రియేట్ చేయడంలో కీలకమైన అంశంలో ఒకటి దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలి లాంటి సినిమా తర్వాత జక్కన్న చేసే సినిమా ఆ స్థాయిని ఇంకాస్త పెంచేది ఉండాలి తప్ప ఒక్క శాతం కూడా తగ్గకూడదు. అందుకు ఆయన ఎంచుకున్న కథ ఓ భారీ మల్టీస్టారర్. మల్టీస్టారర్ అంటే రెండు జెనరేషన్ హీరోలనో.. లేక ఓ కుటుంబంలోని ఇద్దరు హీరోలతోనో కాదు.. సమఉజ్జిల్లాంటి ఇద్దరు హీరోలు కావాలి.. అది కూడా ఎవరికి వారు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్.. డైహర్డ్ అభిమానులున్న హీరోలు కావాలి.
RRR: బామ్మ ‘నాటు’ డాన్స్.. కేకో కేక..!
రాజమౌళి ఆ ఆలోచన నుండి వచ్చిన వారే ఎన్టీఆర్-రామ్ చరణ్. ఈ సినిమా ప్రకటనకి ముందే రాజమౌళికి తెలుసు.. తానొక కత్తిమీద సాము చేయబోతున్నామని. కానీ.. వెనకడుగు వేయకుండా మెగా-నందమూరి కుటుంబాల నుండి వారసులను పట్టుకున్నాడు. ఈ ఇద్దరిలో ఒక్కశాతం ఒక హీరోకి ప్రాధాన్యత పెరిగినా.. మరో హీరోకి ఒక్క నిమిషం పాత్ర నిడివి పెరిగినా ఆ హీరో అభిమానుల మనసు నొచ్చుకుంటుంది. అదేదీ లేకుండా ఇద్దరి పాత్రలను సరిసమానంగా చూపిస్తూ వేవ్ లెంత్ తో పాత్రలను తీర్చిదిద్దాలి.
RRR: జక్కన్న నాటు ప్రమోషన్స్.. దెబ్బకి సోషల్ మీడియా షేక్!
ఇప్పుడంటే చరణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య వాతావరణ ఇలా ఉంది కానీ.. ఆర్ఆర్ఆర్ ప్రకటన చేసే సమయానికి అభిమానుల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉత్తర దక్షణ ధృవాలుగా కనిపించారు. అలాంటి సమయంలో రాజమౌళి ప్రకటన ఈ ఇద్దరి హీరోల అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక, రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రకటన సమయంలో తన మనసులో ఏది అనుకున్నాడో అదే కెమెరాలో బంధించాడు. దానికి ఉదాహరణే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్స్. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ కి సంబంధించి తారక్, చెర్రీలలో ఒకరిని పెంచలేదు.. మరొకరిని తగ్గించలేదు.
RRR: అమెరికాలో ఆర్ఆర్ఆర్ టికెట్ల రేట్ల తగ్గింపు.. కారణమేంటి?
తాజాగా విడుదల చేసిన లిరికల్ సాంగ్ లో కూడా ఇద్దరు హీరోలు సమానంగా చిందులేస్తుంటే ఈ హీరోల రెండు కుటుంబాల అభిమానులకు రెండు కళ్ళు చాలడం లేదు. సినిమాలో కూడా ఇదే టెంపో.. హీరోలకు ఇదే ప్రాధాన్యత ఇవ్వనున్నాడని ఇంతకి మించి నమ్మకం అక్కర్లేదు. దీంతో అసలు సిసలైన మల్టీస్టారర్ అంటే ఇది కదా అనేస్తున్నారు సినీ పండితులు కూడా. మల్టీస్టారర్ చేయాలనే సినీ మేకర్స్ కు ఆర్ఆర్ఆర్ ఒక పాఠంగా మారుతుందని విశ్లేషకుల కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా విడుదలై అందరూ అంచనా వేస్తున్నట్లుగా సినిమా ఫలితంతో పాటు ఇద్దరు హీరోల బ్యాలెన్స్ చేయగలిగితే.. మల్టీస్టారర్ సినిమా చరిత్రలో రాజమౌళి పేరు లిఖించుకోవాల్సిందే.