RRR Collections : రెండు రోజుల్లో 350 కోట్లు.. ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల సునామి..

రెండో రోజు కూడా భారీగా వసూలు చేసింది 'ఆర్ఆర్ఆర్'. రెండో రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండు రోజుల్లోనే మొత్తం 350 కోట్ల గ్రాస్..........

Ram Charan-Jr NTR

RRR Collections :  చరణ్, తారక్ కాంబోలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు భారీగా రాబడుతుంది. మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలలో భారీగా కలెక్ట్ చేసి 223 కోట్ల గ్రాస్ కలెక్షన్లని సాధించింది ఈ సినిమా. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా మొదటి రోజు ఈ రేంజ్ లో కలెక్ట్ చేయలేదు. కలెక్షన్లలో సునామి సృష్టిస్తుంది ‘ఆర్ఆర్ఆర్’. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ భారీగా కలెక్షన్లని రాబడుతుంది.

ఇక నిన్న రెండో రోజు కూడా భారీగా వసూలు చేసింది ‘ఆర్ఆర్ఆర్’. రెండో రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండు రోజుల్లోనే మొత్తం 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసింది. 200 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి సినీ వర్గాలని ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటికే 200 కోట్లకు పైగా రాగా ఇంకో 250 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వస్తే సినిమాకి లాభాలు వచ్చినట్టే.

Chiranjeevi : చరణ్‌కి ఇలా బర్త్‌డే విషెస్ చెప్పడం వింతగా ఉంది

అయితే నార్త్ లో అమాంతంగా రెండో రోజు వసూళ్లు పెరిగాయి. మొదటి రోజు 22 కోట్లు రాగా రెండో రోజు మాత్రం 50 కోట్లకు పైగా నార్త్ లో కలెక్షన్స్ సాధించింది. మిగిలిన ఏరియాలలో కూడా కలెక్షన్లు పెరిగాయి. ఇక అమెరికా, ఆస్ట్రేలియాలో ఇప్పటికే రికార్డు సృష్టించిన ఈ సినిమా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గకుండా ఓవర్సీస్ లో దూసుకుపోతుంది. ఇవాళ ఆదివారం వీకెండ్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి మరో రెండు, మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.