×
Ad

RRR Glimpse : గ్లింప్స్ గూస్ బంప్స్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌‌ల ‘ఆర్ఆర్ఆర్’ మూవీ గ్లింప్స్ రిలీజ్..

  • Published On : November 1, 2021 / 11:03 AM IST

Rrr Glimpse

RRR Glimpse: కెరీర్‌లో ఫ్లాప్ అనే పదాన్ని తన కాంపౌండ్‌లోకి రానివ్వని దర్శకదిగ్గజం.. సినిమా సినిమాకి తన స్థాయిని తానే పెంచుకుంటూ.. టాలీవుడ్ సత్తాని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు.. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన సంఘటనలతో.. ఇద్దరు యంగ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా స్థాయి సినిమా..

Unstoppable with NBK : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాలయ్య..

వరల్డ్ వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమా.. పాండమిక్ కారణంగా పలుమార్లు విడుదల వాయిదా.. వదిలిన వీడియోలు, పోస్టర్లతో ఆకాశాన్నంటేలా అంచనాలు ఏర్పడ్డాయి. ఎట్టకేలకు వచ్చే ఏడాది ఆరంభంలో జనవరి 7న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

RRR Pre- Release Event : జక్కన్న ప్లాన్ అదిరిందిగా

నవంబర్ 1 సోమవారం ఉదయం ‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్ రిలీజ్ చేశారు. 45 సెకన్ల గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించింది. గోండు బెబ్బులి కొమరం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌‌ల నట విశ్వరూపానికి ఉదాహరణ అనేలా గ్లింప్స్ అదిరిపోయింది.

Erida : ‘భీమ్లా నాయక్’ బ్యూటీతో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన నాజర్.. వీడియో వైరల్

RRR Release Date : రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతికి ముందే..

సెంథిల్ కుమార్ విజువల్స్, స్వరవాణి కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్, జక్కన్న టేకింగ్ సింప్లీ సూపర్బ్.. పెద్ద పండక్కి వారం ముందుగానే ‘ఆర్ఆర్ఆర్’ తో బాక్సాఫీస్ వద్ద పండుగ తీసుకు రాబోతున్నారు రాజమౌళి. జనవరి 7న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది ‘ఆర్ఆర్ఆర్’..