RRR producer DVV Dhanayya counter to Rajasthan Royals
Rajasthan Royals – RRR : ఈ ఏడాది ఐపీయల్ (IPL) సీజన్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. ఒక పక్క ప్లేయర్స్ గ్రౌండ్ లో అదరగొడుతుంటే, మరో పక్క ఆ జట్టుల సోషల్ మీడియా టీమ్స్ అదిరిపోయే ట్వీట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టుకి చెందిన సోషల్ మీడియా టీం నిన్నటి (మే 7) మ్యాచ్ గురించి ఒక ట్వీట్ చేసింది. ఇక ఆ ట్వీట్ కి RRR నిర్మాత డివివి దానయ్య ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఏంటా ట్వీట్?
Pawan Kalyan OG : మహారాష్ట్రలో జనసైనికులతో పవన్.. OG లుక్ అదిరిపోయిందిగా!
నిన్న రాజస్థాన్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ తో (Sunrisers Hyderabad) మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ సమయంలో రాజస్థాన్ టీం తమ కెప్టెన్ సంజు శాంసన్ (Sanju Samson) ని పొగుడుతూ.. RRR కంటే SSS (Skipper Sanju Samson) బ్యాటింగ్ గొప్పది అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్, హైదరాబాద్ టీం పై ఓడిపోయింది. దీంతో ఆ ట్వీట్ కి డివివి రియాక్ట్ అవుతూ.. రవితేజ ఇడియట్ సినిమాలోని ఒక కామెడీ సీన్ ని షేర్ చేస్తూ కౌంటర్ ఇచ్చాడు. ఆ సీన్ లో.. “తొక్క తీస్తా, ఫ్యాన్స్ బిల్డ్ అప్” అనే డైలాగ్ వస్తుంది.
Adipurush Trailer : ఆదిపురుష్ ట్రైలర్ స్పెషల్ స్క్రీనింగ్.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన కృతి సనన్!
డివివి రియాక్షన్ తో రాజస్థాన్ టీం RRR టీంకి క్షమాపణలు చెప్పింది. RRR మూవీ వరల్డ్ వైడ్ రియాక్ట్ సంపాదించుకుంది. మీ క్షమాపణలు అడుగుతున్నాము అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
https://t.co/ZkOjjssgNC pic.twitter.com/LebAQu4cGX
— DVV Entertainment (@DVVMovies) May 7, 2023