Rrr
RRR: ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం అన్ని సినిమా పరిశ్రమలతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కరోనా వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకి అనేక రిలీజ్ డేట్స్ ప్రకటించారు కానీ వాయిదా పడుతూనే వస్తుంది.
ఇప్పటిదాకా ఇద్దరి హీరోల ఇంట్రోలు తప్ప టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ లాంటివి ఏమి రిలీజ్ అవ్వలేదు. అభిమానులు ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 29న ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అవ్వనుందని తెలుస్తుంది. ఆ పోస్టర్ తో పాటు టీజర్ రిలీజ్ డేట్, టైం కూడా వెల్లడించే అవకాశం ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ టీజర్ ని దీపావళి కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీపావళికి రిలీజ్ అయ్యే టీజర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగేలా ఉన్నాయి.
Samantha : చార్ ధామ్ యాత్రలో సమంత
కొద్ది రోజుల క్రితం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కాని వరం రోజుల గ్యాప్ తో సంక్రాంతికి భీమ్లా నాయక్, సర్కారీ వారి పాట, రాధే శ్యామ్ సినిమాలు కూడా రిలీజ్ అవ్వనున్నాయి. మరి వాటితో పాటు ఈ సినిమా కూడా రిలీజ్ అవుతుందా లేదా మళ్ళీ వాయిదా పడుతుందా లేక ఆ సినిమాలే వాయిదా వేస్తారా చూడాలి.