RRR: వాయిదా తప్పదా.. క్రేజీ మల్టీస్టారర్ కొత్త రిలీజ్ డేట్?
ఇండియన్ మోస్ట్ అవెయిటెడ్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ఎప్పుడప్పుడు థియేటర్లకు వస్తుందా అని సినిమా ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టు ఇప్పటికే విడుదలైన పోస్టర్ల నుండి..

Rrr
RRR: ఇండియన్ మోస్ట్ అవెయిటెడ్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ఎప్పుడప్పుడు థియేటర్లకు వస్తుందా అని సినిమా ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టు ఇప్పటికే విడుదలైన పోస్టర్ల నుండి వీడియోల వరకు సినిమా మీద అంచనాలను పెంచేశాయి. దీంతో సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ప్రేక్షకులు అతృతతో ఉన్నారు. అయితే.. ప్రేక్షకుల ఆతృతకు తగ్గట్లే సినిమా కూడా వాయిదా పడి మరింత నీరక్షణ తప్పేలా కనిపించడం లేదు.
అక్టోబర్ 13న సినిమా విడుదల చేస్తామని మొన్నటి వరకు యూనిట్ చెప్తూ వచ్చింది. ఈ మధ్యనే షూటింగ్ పూర్తిచేసి గుమ్మడి కాయ కూడా కొట్టేసిన యూనిట్ పోస్టర్ విడుదల చేసి ఆ విషయాన్ని చెప్పింది. కానీ.. ఆ పోస్టర్ లో రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు. అయితే.. మొన్నటి వరకు చెప్పిన అక్టోబర్ 13 రిలీజ్ డేట్ అంటే మరో నలభై రోజులు మాత్రమే సమయముంది. 400 కోట్ల భారీ బడ్జెట్ సినిమా, అది కూడా భారీ స్థాయి వీఎఫ్ఎక్స్ విజువల్స్ ఉండే సినిమాకు కేవలం 40 రోజులలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించగలరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ దర్శక, నిర్మాతలు కూడా ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమా కొసం కొత్త రిలీజ్ డేట్ వేటలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది దసరా నుండి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా ఓ రూమర్ వినిపిస్తుంది. అయితే, ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి మరికొన్ని సినిమాలు కూడా ప్లాన్ చేసుకున్నారు. మరి అసలైన క్రేజీ మల్టీస్టారర్ సినిమా కాబట్టి ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి వస్తే మిగతా సినిమాలకు గడ్డుకాలమే అవుతుంది. కాగా.. జక్కన్న అండ్ కో మనసులో ఏముందో.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.