జూ.ఎన్టీఆర్ బర్త్ డేకు RRR team surprise

  • Published By: Subhan ,Published On : May 17, 2020 / 04:27 PM IST
జూ.ఎన్టీఆర్ బర్త్ డేకు RRR team surprise

Updated On : May 17, 2020 / 4:27 PM IST

డైరక్టర్ SS Rajamouli తర్వాతి భారీ బడ్జెట్ మూవీ RRR. ఇండియన సినిమా హిస్టరీలోనే నిలిచిపోయే సినిమాలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట, అజయ్ దేవగన్, ఒలివియా మారిరస్, రే స్టీవెన్ సన్, అలీసన్ డూడీలు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ రూమర్లు ఎన్టీఆర్ అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. 

ఎస్ఎస్ రాజమౌళితో పాటు ఎంటైర్ టీం జూ.ఎన్టీఆర్ బర్త్ డేకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట. రామ్ చరణ్ బర్త్ డేకు ప్లాన్ చేసిన విధంగా ఎన్టీఆర్ అభిమానులను అసంతృప్తి గురి చేయకుండా ఏం రెడీ చేస్తారో చూడాలి. కొమరం భీంగా నటిస్తున్న జూ.ఎన్టీఆర్ క్యారెక్టర్ లుక్ ఎలా ఉంటుందో అనే అంచనాలు పెరిగిపోతున్నాయి. 
మే20న జూ.ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. మార్చి 27న జరిగిన రామ్ చరణ్ పుట్టిన రోజుకు RRR టీం ప్లాన్ చేసి అల్లూరి సీతారామరాజు వీడియో క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. అది కూడా ఎన్టీఆర్ చేతుల మీదుగానే జరిగింది. 

‘హ్యాపీ బర్త్ డే చరణ్. ప్రామిస్ చేసినట్లుగానే. సర్ ప్రైజ్ ఇస్తున్నా. హ్యాపీ బర్త్ డే బ్రదర్. మన బంధం కలకాలం ఉండాలని ఆశిస్తున్నా’ అంటూ పోస్టు చేశాడు. ఆ వీడియోలో వాయీస్ ఓవర్ కూడా ఎన్టీఆర్ చెప్పిందే. మరి మే20న ఎలాంటి వీడియో వస్తుందో.. పది భాషల్లో రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ లా వాయీస్ ఓవర్ చెప్తాడా.. మరేదైనా స్పెషల్ ప్లాన్ చేశారా.. డీవీవీ దానయ్య సమర్పణలో 2021 జనవరి 8న విడుదల కానున్న సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందోనని అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. 

కరోనా వైరస్ కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో ముందుగా అనుకున్న సమయం కంటే సినిమా రిలీజ్ ఆలస్యమవుతుందని చిత్ర యూనిట్ అనుకుంటుంది. బహుశా సమ్మర్లో రిలీజ్ ఉండొచ్చని భావిస్తున్నారు. అధికారికంగా ఎటువంటి సమాచారం వెలువడలేదు.