RRR Team on Red Carpet : గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్ పై RRR చిత్రయూనిట్.. స్టైలిష్ లుక్స్ లో చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి..

ఈ రెడ్ కార్పెట్ వేడుకకి ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి సతీ సమేతంగా వెళ్లారు. రెడ్ కార్పెట్ పై స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టారు. అందరూ బ్లాక్ డ్రెస్ లకి ప్రిఫరెన్స్ ఇచ్చారు. అఫిషియల్ గా............

RRR Team stylish looks on Golden Globe Red Carpet

RRR Team on Red Carpet :  RRR సినిమా అంతర్జాతీయ వేదికలపై అదరగొడుతూనే ఉంది. ఇప్పటికే సినిమాని, దర్శకుడు రాజమౌళిని అందరూ అభినందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. ఈ పాటకి హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయి కాలు కదులుపుతున్నారు. ఇప్పటికే నాటు నాటు సాంగ్ ఆస్కార్ క్వాలిఫికేషన్స్ లిస్ట్ లో చేరింది. హాలీవుడ్ లో పలు అవార్డులు అందుకుంటున్న RRR సినిమా తాజాగా ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకుంది.

నాటు నాటు పాటకి గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఈ పాట సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. ఇక ఈ రెడ్ కార్పెట్ వేడుకకి ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి సతీ సమేతంగా వెళ్లారు. రెడ్ కార్పెట్ పై స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టారు. అందరూ బ్లాక్ డ్రెస్ లకి ప్రిఫరెన్స్ ఇచ్చారు. అఫిషియల్ గా, కార్పొరేట్, హెవీ లుక్స్ కనపడేలా అందరూ బ్లాక్ తో పాటు వేరే కాంబోతో డ్రెస్ లు వేసి స్టైలిష్ గా కనిపించారు.

RRR gets Golden Globe Award : కీరవాణికి వెల్లువెత్తుతున్న అభినందనలు.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేదికపై కీరవాణి ఏం మాట్లాడాడో తెలుసా??

రామ్ చరణ్ పైనుంచి కిందవరకూ నల్లటి షేర్వాణీ సెట్‌లో అదరగొట్టాడు. ఇక ఎన్టీఆర్ బ్లాక్ ప్యాంట్ కి వైట్ షర్ట్ వేసి పైన బ్లాక్ బ్లేజర్‌ వేసుకొని మరింత స్టైలిష్ గా కనపడ్డాడు. రాజమౌళి బ్లాక్ సిల్క్ కుర్తాతో రెడ్ ప్రింటెడ్ ధోతీ ప్యాంటు ధరించి రెడ్ కార్పెట్ మీద నడిచాడు. కీరవాణి కూడా టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రెస్ తో అదరగొట్టారు. ఇక రాజమౌళి భార్య రమా రాజమౌళి రెడ్ అండ్ గ్రీన్ శారీ కట్టగా కీరవాణి భార్య కూడా రెడ్ శారీ ధరించారు. ఉపాసన శారీ కట్టగా, ప్రణతి బ్లాక్ స్టైలిష్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. మొత్తానికి గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్ పై RRR టీం ఫ్యామిలీలతో స్టైలిష్ గా అదరగొట్టేశారు.