Anasuya : అనసూయ వస్తుందని.. ఏకంగా ఆర్టీసీ బస్టాండ్‌నే మూసేసారు.. మండిపడ్డ ప్రయాణికులు..

తాజాగా అనసూయ కడప జిల్లా మైదుకూరులోని ఓ బట్టల షాప్ ఓపెనింగ్ కి వెళ్ళింది.

Anasuya : అనసూయ వస్తుందని.. ఏకంగా ఆర్టీసీ బస్టాండ్‌నే మూసేసారు.. మండిపడ్డ ప్రయాణికులు..

RTC Bus stand Closed due to Anasuya Coming for Shop Opening

Updated On : December 8, 2024 / 10:55 AM IST

Anasuya : సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడికైనా వెళ్తే ఎంతో కొంత సెక్యూరిటీ ఉంటుంది. ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలు ఉండటం సాధారణం కానీ నటి, యాంకర్ అనసూయ వచ్చిందని ఏకంగా ఆర్టీసీ బస్టాండ్ నే మూసేసారు. అనసూయ ఓ పక్క సినిమాలు, షోలతో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు షాప్ ఓపెనింగ్స్ కూడా చేస్తుంది.

అయితే నిన్న అనసూయ కడప జిల్లా మైదుకూరులోని ఓ బట్టల షాప్ ఓపెనింగ్ కి వెళ్ళింది. అయితే ఆ బట్టల షాప్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉంది. దీంతో అనసూయ వస్తుందని, జనాలు భారీగా వస్తున్నారని అధికారులు ఏకంగా ఆర్టీసీ బస్టాండ్ నే మూసేసారు. బస్సులు బయటి నుంచి బయటికి పంపించేశారు. దీంతో అక్కడి ప్రజలు, ప్రయాణికులు అధికారులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Also Read : Top 10 Movies : ఫస్ట్ డే భారీ వసూళ్లు రాబట్టిన టాప్ 10 ఇండియన్ సినిమాలు.. అందులో సగం ప్రభాస్ వే..

అనసూయ వస్తే ఏంటి, వచ్చి షాప్ ఓపెనింగ్ చేసుకుంటే ఏంటి? ఆమె వస్తుందని ఏకంగా బస్టాండ్ ని మూసేయడం ఏంటి అని అక్కడి ప్రయాణికులు మీడియాతో మాట్లాడుతూ విమర్శలు చేసారు. అయితే ఈ విషయంలో అనసూయ తప్పేమి లేదని, అసలు ఆమెకు ఈ విషయం కూడా తెలీదని, అధికారులే ఇలా చేశారని ఈవెంట్ నిర్వాహకులు చెప్పినట్టు సమాచారం.