Rudramambapuram : హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న రుద్రామాంబపురం.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంశలు..

రుద్ర‌మాంబ‌పురం.. మూల‌వాసుల క‌థ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రస్తుతం ఈ సినిమా హాట్ స్టార్ లో విడుదలై మంచి స్పందన లభిస్తోంది.

Rudramambapuram Movie streaming in Hotstar Minister Talasani Srinivas Yadav Appreciated movie team

Rudramambapuram Movie : ఎన్‌వీఎల్ ( NVL )ఆర్ట్స్ ప‌తాకంపై నండూరి రాము నిర్మించిన చిత్రం రుద్రమాంబపురం. మ‌హేష్ బంటు ద‌ర్శ‌కత్వం వహించిన ఈ సినిమాకు మూల కథ అజయ్ ఘోష్. శుభోద‌యం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, టివి.ఎయిట్ సాయి, శంకర్, డివి.సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన చిత్రం `రుద్ర‌మాంబ‌పురం`. మూల‌వాసుల క‌థ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రస్తుతం ఈ సినిమా హాట్ స్టార్ లో విడుదలై మంచి స్పందన లభిస్తోంది.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ… రుద్రమాంబపురం సినిమా మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు , ఆచారాలు, వారి కష్ట సుఖాల మీద వచ్చింది. రుద్రమాంబపురం సినిమా బాగుంది. చిత్ర యూనిట్ సభ్యులందరికి అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.

Natho Nenu : జబర్దస్త్ కమెడియన్ డైరెక్టర్ గా సినిమా.. దిల్‌ రాజ్‌ చేతుల మీదుగా ‘నాతో నేను’ ట్రైలర్‌ లాంచ్‌

నిర్మాత నండూరి రాము మాట్లాడుతూ… మా రుద్రమాంబపురం సినిమా డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా చూసిన అందరూ బాగుంది అంటున్నారు, ప్రస్తుతం సినిమా హాట్ స్టార్ లో టాప్ పొజిషన్ లో ట్రేండింగ్ అవుతోంది. థియేటర్స్ లో రావాల్సిన సినిమా ఇదని అంటుంటే ఆనందంగా ఉంది. నటులు అజయ్ ఘోష్, రాజశేఖర్ పోటీ పడి నటించారు. రుద్రమాంబపురం సినిమాకు రివ్యూస్ కూడా బావున్నాయి. త్వరలో మా NVL బ్యానర్ నుండి మరో సినిమాను అనౌన్స్ చెయ్యబోతున్నాము అన్నారు.