యూపీ వాళ్లకి తెలుగువాడు యముడిలా కనబడుతున్నాడా?- ‘రూలర్’ లేటెస్ట్ ట్రైలర్..

నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన ‘రూలర్’ లేటెస్ట్ ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : December 16, 2019 / 06:55 AM IST
యూపీ వాళ్లకి తెలుగువాడు యముడిలా కనబడుతున్నాడా?- ‘రూలర్’ లేటెస్ట్ ట్రైలర్..

నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన ‘రూలర్’ లేటెస్ట్ ట్రైలర్ రిలీజ్..

నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘రూలర్’.. వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలు.. ప్రకాష్ రాజ్, జయసుధ, భూమికా చావ్లా కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ శనివారం వైజాగ్‌లో ఘనంగా నిర్వహించారు.

Image

తాజాగా ‘రూలర్’ లేటెస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. రైతుల గొప్పదనం, టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ల ప్రాముఖ్యత గురించి సినిమాలో చెప్పనున్నారు. బాలయ్య తన స్టైల్ ఊరమాస్ డైలాగులతో అదరగొట్టాడు. ఆడియో సాంగ్స్‌కి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ‘పడతాడు’ సాంగ్ రిపీట్ మోడ్‌లో వింటున్నారు బాలయ్య ఫ్యాన్స్.

Image

ట్రైలర్ విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ‘రూలర్’  ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. సంగీతం : చిరంతన్ భట్, కెమెరా : సి.రామ్ ప్రసాద్, నిర్మాత : సి.కళ్యాణ్.

Image