Deepika Padukone : తల్లి కాబోతున్న దీపికా పదుకోన్? త్వరలో గుడ్ న్యూస్ అంటూ వార్తలు
దీపికా పదుకోన్ తల్లి కాబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. లండన్‌లో జరిగిన బాఫ్టా అవార్డుల వేడుకలో దీపికాను చూసిన వారంతా ఇదే మాట అంటున్నారు.
- Lakshmi 10tv
- Updated on- February 20, 2024 / 04:45 PM IST
Deepika Padukone
Deepika Padukone : బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా పదుకోన్ లండన్‌లో జరిగిన బాప్టా 2024 అవార్డుల కార్యక్రమంలో బంగారు రంగు చీరలో మెరిసారు. ఈ వేడుక తర్వాత దీపికా ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చునంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.
HanuMan : హనుమాన్ మూవీ మోస్ట్ అవైటెడ్ సాంగ్.. ‘రఘునందన్’ ఆడియో వచ్చేసింది..
దీపికా పదుకోన్ ఫిబ్రవరి 18న లండన్‌లో జరిగిన బాఫ్టా (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) అవార్డుల కార్యక్రమంలో వ్యాఖ్యాతలలో ఒకరిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో బంగారు, వెండి రంగుల కలయికలో ఉన్న చీరను ధరించి మెరిసిపోయారు. ఈ సందర్భంలో ఆమె చీర కొంగుతో తన బేబీ బంప్‌ను దాచుకోవడానికి ప్రయత్నించారంటూ అభిమానులు ఊహాగానాలు మొదలుపెట్టారు. దీపికా రెడ్ కార్పెట్‌పై నడుస్తూ చీర పల్లు పట్టుకున్న విధానం అభిమానుల్లో అనుమానాలకు తావిచ్చింది.
Priyamani : బాలీవుడ్ చీప్ ట్రిక్స్ బయట పెట్టిన ప్రియమణి.. పాపులారిటీ కోసం వారే..
ఇక ఆ వేడుక తర్వాత చాలామంది అభిమానులు ‘ఖచ్చితంగా ఆమె ప్రెగ్నెంట్ అని నమ్ముతున్నాను’.. ‘బేబీ పదుకోన్ తప్పకుండా వస్తుంది’ అంటూ కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. మరికొందరు ఆమె వ్యక్తిగత జీవితంలోకి చొరబడి కామెంట్స్ చేయడం సరికాదని విమర్శించారు. బహిరంగ చర్చలు చేయడం సముచితం కాదన్నారు. దీపికాకు 2018 లో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్‌ను పెళ్లాడారు. ప్రస్తుతం దీపికా ప్రభాస్‌తో ‘కల్కి’, హిందీలో ‘సింగమ్ రిటర్న్స్’ సినిమాల్లో చేస్తున్నారు.
