Priyamani : బాలీవుడ్ చీప్ ట్రిక్స్ బయట పెట్టిన ప్రియమణి.. పాపులారిటీ కోసం వారే..

బాలీవుడ్ లో పాపారాజి అంటూ అక్కడ స్టార్స్ చేసే చీప్ ట్రిక్స్ బయట పెట్టిన ప్రియమణి. వైరల్ అవుతున్న వీడియో.

Priyamani : బాలీవుడ్ చీప్ ట్రిక్స్ బయట పెట్టిన ప్రియమణి.. పాపులారిటీ కోసం వారే..

Tollywood Heroine Priyamani viral comments about Bollywood stars Paparazzi culture

Updated On : February 20, 2024 / 4:00 PM IST

Priyamani : తెలుగు సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియమణి.. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. మధ్య మధ్యలో నార్త్ లో కూడా పలు సినిమాల్లో కనిపించారు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాలో షారుఖ్ ఖాన్ తో కలిసి ఓ ప్రత్యేక సాంగ్ లో చిందేసి బాలీవుడ్ ఆడియన్స్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మళ్ళీ ఇటీవల ‘జవాన్’ సినిమాలో షారుఖ్ పక్కన ఒక ముఖ్య పాత్ర చేసి హిందీ ఆడియన్స్ ని అలరించారు.

అయితే జవాన్ సినిమా చేసిన తరువాత.. బాలీవుడ్ స్టార్స్ తమ పబ్లిసిటీ కోసం వాళ్ళు చేసే ఒక చీప్ ట్రిక్ తనకి తెలిసిందని రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రియమణి చెప్పుకొచ్చారు. ఇటీవల బాలీవుడ్ లో పాపారాజి (Paparazzi) అనే పదం గట్టిగా వినిపిస్తుంది. ఈ పదం అర్ధం ఏంటంటే.. ఎయిర్ పోర్ట్స్, హోటల్ అండ్ రెస్టారెంట్స్, జిమ్స్ బయట సినిమా స్టార్స్ ని ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీయడమే. ఇక ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

Also read : Teja Sajja : ఇది కదా సక్సెస్ అంటే.. మహేష్ బాబు ఒకప్పుడు.. ఇప్పుడు తేజ సజ్జనే.. వీడియో వైరల్..

ఈ ఫోటోలు, వీడియోలు చూసిన నెటిజెన్స్.. ఫోటోగ్రాఫర్స్ స్టార్స్ ఎక్కడ ఉన్నారో తెలుసుకొని అక్కడికి వెళ్లి ఫోటోలు తీస్తారని ఇన్నాళ్లు అనుకున్నారు. అయితే అసలు నిజం అది కాదట. బాలీవుడ్ స్టార్స్ ఆ ఫోటోగ్రాఫర్స్ కి డబ్బులు ఇచ్చి.. వారి ఉన్న చోటకి పిలిపించుకుంటారట. అలా వారితో ఫోటోలు తీయుంచుకొని.. సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయించుకునే బాలీవుడ్ ప్రమోషన్ స్టంట్ అంట అందంతా.

జవాన్ తరువాత ఆ మూవీలోని చాలామంది స్టార్స్.. ఇలాగే డబ్బులు ఇచ్చి ఫోటోగ్రాఫర్స్ ని పిలిపించుకుంటారట. ఇక ఇలా చేద్దామని ప్రియమణి అసిస్టెంట్ తనకి చెప్పినప్పుడు ఆమె షాక్ అయ్యారట. అంతేకాదు, ఆ ఫోటోగ్రాఫర్స్ కి ఇచ్చే రెమ్యూనరేషన్ చార్ట్ కూడా చూసి కంగు తిన్నారట. బాలీవుడ్ స్టార్స్ లోని చాలామంది ఇదే కల్చర్ ని ఫాలో అవుతారని ప్రియమణి ఓపెన్ గా చెప్పేసారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.