×
Ad

Pawan Kalyan : ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ నా ఫ్రెండ్ అని చెప్పుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నా.. ఎస్ జె సూర్య!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎస్ జె సూర్య కలయికలో వచ్చిన ఖుషీ మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలుసు. సినిమాలు పక్కన పెడితే వ్యక్తిగతంగా వీరిద్దరూ మంచి స్నేహితులు. పవన్ అంటే తనకి చాలా ఇష్టం అంటూ ఎస్ జె సూర్య చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి పవన్ పై తన అభిమానాన్ని తెలియజేశాడు.

  • Published On : March 11, 2023 / 10:22 AM IST

S J Suryah says he is waiting to tell andrapradesh cm pawan kalyan is his friend

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీ మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలుసు. ఈ సినిమాతో తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య టాలీవుడ్ డెబ్యూట్ ఇచ్చాడు. ఆ తరువాత వీరిద్దరి కలయికలో పులి సినిమా కూడా వచ్చింది. సినిమాలు పక్కన పెడితే వ్యక్తిగతంగా వీరిద్దరూ మంచి స్నేహితులు. పవన్ అంటే తనకి చాలా ఇష్టం అంటూ ఎస్ జె సూర్య చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి పవన్ పై తన అభిమానాన్ని తెలియజేశాడు.

Ustaad Bhagat Singh : పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉస్తాద్ భగత్ సింగ్ పనులు మొదలు!

ఇక సినిమాలు నుంచి రాజకీయం వైపు వచ్చిన పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు పూర్తీ చేసుకున్నాడు. సినీ రంగంలోను 27 ఏళ్ళ ప్రయాణం పూర్తి చేసుకున్నాడు. దీంతో ఎస్ జె సూర్య, పవన్ కి అభినందనలు తెలియజేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ”పవన్ కళ్యాణ్ అనేది ఒక పేరు కాదు, అది ఒక నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు సినిమా తెరపైనే కాదు పొలిటికల్ గాను ఒక గ్రేట్ లీడర్. ప్రజలు కోసం మీరు చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణ్ నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకునే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను.

ఇది కేవలం నా ఒక్కడి కల మాత్రమే కాదు, ఎంతోమంది కల కూడా. ఇలాంటి ఆశీర్వాదాలు చాలా తక్కువమందికి దొరుకుతుంది. తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ మరియు రాజకీయాల్లో గ్రేట్ లీడర్ ఎంజీఆర్ కూడా అలాంటి వ్యక్తే. పవన్ గారు గురించి నేను ఎప్పుడు మాట్లాడినా, నాకు ఎంజీఆర్ గారే గుర్తుకు వస్తారు. సినిమాల్లో చరిష్మా, రాజకీయాల్లో వాళ్ళ ఆలోచనలు అవన్నీ పుట్టకతో వస్తాయి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.