ప్రస్తుతం థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోబోతున్న సాహో నుండి ‘బేబి వోంట్ యూ టెల్ మి’ అనే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటించిన మోస్ట్ అవైటెడ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్.. సాహో.. ఆగస్టు 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోబోతున్న సాహో నుండి ‘బేబి వోంట్ యూ టెల్ మి’ అనే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.
‘కలిసుంటే నీతో ఇలా.. కలలాగే తోచిందిగా.. తలవంచి ఆకాశమే నిలిచుందా నా కోసమే.. కరిగిందా ఆ దూరమే.. వదిలెళ్లా నా నేరమే.. నమ్మింకా నన్నే ఇలా.. తీరుస్తా నీ ప్రతి కలా’.. అంటూ సాగే సాంగ్ లిరికల్స్ బాగున్నాయి. విజువల్స్ అదిరిపోయాయి.
Read Also : ‘రొమాంటిక్’ – ఫస్ట్‌లుక్..
ప్రభాస్, శ్రద్ధల కెమిస్ట్రీ పాటకే హైలెట్‌గా నిలిచింది.. శంకర్ ఎహసాన్ లాయ్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, కృష్ణకాంత్ లిరిక్స్ రాసాడు. శ్వేతా మోహన్, సిద్ధార్థ్ మహదేవన్, శంకర్ మహదేవన్ పాడారు. ఈ పాటకు యూట్యూబ్‌లో భారీగా వ్యూస్, లైక్స్ అండ్ కామెంట్స్ వస్తున్నాయి..