Sadha comments on celebrities divorce in recent times
Sadha : టాలీవుడ్ హీరోయిన్ సదా నితిన్ ‘జయం’ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యింది. మొదటి సినిమాకే ఫిలింఫేర్ అవార్డుని కుల సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన సదా చాలావరకు స్టార్ హీరోల పక్కన స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక సినిమా అవకాశాలు తగ్గిన దగ్గర నుంచి పలు టీవీ షోల్లో కూడా కనిపించి అలరించింది. 2002 నుంచి 2018 వరకు వరుసగా సినిమాల్లో కనిపిస్తూ వచ్చిన సదా ప్రస్తుతం మూవీస్ కి దూరంగా ఉంది.
Nani 30 : నాని 30 అప్డేట్ వచ్చేసింది.. ‘హాయ్ నాన్న’ అంటూ వచ్చేస్తున్న నాని..
కాగా ఈ అందాల భామ ఇప్పటికి ఇంకా ఒంటరిగానే ఉంది. దాదాపు నాలుగు పదుల వయసుకు దగ్గరిలో ఉన్న ఈ భామ.. పెళ్లి అనే విషయాన్ని అసలు మాట్లాడడం లేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సదాని.. పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనికి సదా బదులిస్తూ.. “పెళ్లి చేసుకున్న తరువాత ఫ్రీడమ్ ఉండదు. నాకు నచ్చింది నేను చేయలేను. ప్రస్తుతం నేను నాకు నచ్చిన పని చేస్తున్నాను. మనల్ని అర్ధం చేసుకునే వ్యక్తి దొరికితే పెళ్లి జీవితం బాగానే ఉంటుంది. కానీ అలా జరగకపోతే విడిపోవాల్సి వస్తుంది. ఇటీవల కొంతమంది గ్రాండ్‌గా పెళ్లి చేసుకొని విడిపోతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాము. అలా విడిపోవడంకన్నా పెళ్లి చేసుకోకుండా ఉండడం బెటర్” అంటూ వ్యాఖ్యానించింది.
Multiplex Food : GST తగ్గింది.. మరి మల్టీప్లెక్స్ లలో పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ రేట్లు తగ్గుతాయా?
ఈమధ్య కాలంలో సమంత, నిహారిక గ్రాండ్ గా పెళ్లి చేసుకొని విడిపోయారు అంటూ నెటిజెన్స్ ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా సదా ప్రస్తుతం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారి తనకిష్టమైన లైఫ్ ని జీవిస్తుంది. సదా తీసిన వైల్డ్ లైఫ్ ఫొటోస్ ని తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ వస్తుంటుంది. ఒకసారి సదా తిని కొన్ని ఫొటోస్ ని మీరు కూడా చూసేయండి.