Sahil Salathia stunning photos with burning candles on shoulders
Sahil Salathia : ప్రతీ పండగలకి సినీ తారలు తమ సోషల్ మీడియా వేదికగా రకరకాల ఫోటోలని షేర్ చేస్తూ ఉంటారు. తమదైన స్టైల్ లో క్రియేటివిటీ చూపిస్తూ సరికొత్తగా కనిపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు సినీ సెలెబ్రిటీస్ అయితే విచిత్రమైన డ్రెస్సులు ధరిస్తారు. అయితే నేడు దీపావళి సందర్బంగా చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రెటీస్ తమ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్నారు .
Also Read : Rajinikanth : ఓటీటీలోకి వచ్చేస్తున్న వేట్టయన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
అందులో భాగంగానే ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ సాహిల్ సలాథియా తన సోషల్ మీడియాలో దీపావళి శుభాకాంక్షలను వెరైటీగా తెలిపారు. అందరికంటే భిన్నంగా.. మండుతున్న కొవ్వత్తులను తన భుజాలపై పెట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చాడు. దీపావళితో పాటు హాలోవీన్ శుభాకాంక్షలు కూడా తెలిపారు. దీంతో ఈ ఫోటోలను చూసిన కొందరు నెటిజన్స్ ఇలా కూడా దీపావళి విషెస్ చెప్తారా అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఇప్పటికే ఎన్నో సినిమాలు, సీరియల్స్ చేసి బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు సాహిల్ సలాథియా. సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకి సంబందించిన విషయాలను షేర్ చేసుకుంటారు.