Bro Movie : వినోదయ సిత్తం కథకి.. బ్రో స్టోరీకి.. చాలా తేడా ఉంటుంది.. పవన్ ఫైట్స్ కూడా.. సాయి ధరమ్ తేజ్!
వినోదయ సిత్తం కథ నుంచి కేవలం మెయిన్ లైన్ మాత్రమే తీసుకున్నారట. బ్రో మూవీలో పవన్ పై..
- gum 95921
- Published On : July 18, 2023 / 05:44 PM IST
Sai Dharam Tej about Pawan Kalyan fight sequence in Bro Movie
Bro Movie : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) మెయిన్ లీడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తూ చేస్తున్న సినిమా ‘బ్రో’. ఈ చిత్రం తమిళ్ హిట్ మూవీ వినోదయ సిత్తంకి రీమేక్ గా వస్తుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాకి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. తమిళ్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సముద్రఖని.. ఈ రీమేక్ ని కూడా డైరెక్ట్ చేశాడు. కాగా తమిళంలో ఈ చిత్రాన్ని ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారు.
Sai Dharam Tej : నా లవ్ ఫెయిల్యూర్స్‌ని కూడా ఫ్యామిలీలో ఆయనతోనే షేర్ చేసుకుంటా..
ఆల్రెడీ ఆ చిత్రాన్ని చూసిన కొంతమంది సినిమాని అనౌన్స్ చేసిన సమయంలో.. అసలు ఆ మూవీని ఎందుకు రీమేక్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న సాయి ధరమ్ ఒక ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ కి బదులిచ్చాడు. వినోదయ సిత్తం కథకి, బ్రో మూవీ స్టోరీకి చాలా తేడా ఉంటుందని వెల్లడించాడు. వినోదయ సిత్తం నుంచి కేవలం మెయిన్ లైన్ మాత్రమే తీసుకున్నట్లు, మిగతా మొత్తాన్ని దర్శకుడు త్రివిక్రమ్ చాలా బాగా డిజైన్ చేశాడని చెప్పుకొచ్చాడు.
Bro Movie : బ్రో సినిమాలో పవన్ రన్ టైం ఎంతో తెలుసా..? పవన్ స్క్రీన్ పై కనిపించేది..
ఈ సినిమాలో పవన్ అండ్ సాయి ధరమ్ మధ్య ఉన్న బాండింగ్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుందని, టైం ఉన్నప్పుడే జీవితాన్ని ఆనందంగా గడిపేయాలనే లైన్ మీద ఫ్యామిలీ అండ్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా సినిమా ఉండబోతుందని వెల్లడించాడు. ఇక ఈ సినిమాలో పవన్ పై ఫైట్ సీక్వెన్స్ ఏమి ఉండవని ప్రచారం జరుగుతుండడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. దీని పై కూడా తేజ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో పవన్ పై డాన్స్ అండ్ ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంటాయని వెల్లడించాడు.
