Sai Dharam Tej and Akira Nandan Josh in Pawan Kalyan Winning Mega Family Celebrations
Sai Dharam Tej : ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలవడమే తన జనసేన అభ్యర్థులంతా గెలవడంతో దీంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ కు అన్నివైపుల నుంచి అభినందనలు వస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచాక మొదటిసారి పవన్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చారు.
Also Read : Pawan Kalyan Mother : తల్లి, వదిన కాళ్లకు నమస్కరించిన పవన్ కళ్యాణ్.. ఏడ్చేసిన పవన్ తల్లి..
పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజనోవా, తనయుడు అకిరా నందన్ తో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లగా మెగా ఫ్యామిలీ అంతా పూలు జల్లి స్వాగతం తెలిపారు. మెగా ఫ్యామిలీ అంతా కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ అంతా కేక్ కట్ చేస్తుంటే వెనకాల సాయి ధరమ్ తేజ్ విజిల్స్ వేస్తూ సందడి చేశాడు. కంటిన్యూగా తేజ్ విజిల్స్ వేస్తూనే ఉన్నాడు. పవన్ తనయుడు అకిరాతో కూడా కలిసి అల్లరి చేస్తున్నాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
అయితే సాయి ధరమ్ తేజ్ కి మామయ్య పవన్ అంటే చాలా ఇష్టమని తెలిసిందే. ఇప్పటికే అనేక సార్లు తేజ్ మామయ్యతో తనకు ఉన్న అనుబంధం గురించి తెలిపాడు. పవన్ కి కూడా తేజ్ అంటే చాలా ఇష్టం. గతంలో వీళ్లిద్దరి వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఎన్నికల్లో గెలిచాక కూడా సాయి ధరమ్ తేజ్ మామయ్య ఇంటికి వెళ్లి పవన్ ని ఎత్తుకొని తిప్పాడు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. పవన్ తో కలిసి మంగళగిరికి కూడా వెళ్ళాడు తేజ్. ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఇంట్లో చేసుకునే సెలబ్రేషన్స్ లో సాయి ధరమ్ తేజ్ ఫుల్ జోష్ తో సందడి చేస్తుండటంతో మరోసారి మామయ్య – అల్లుడు అనుబంధం గురించి మాట్లాడుకుంటున్నారు.