మాటిచ్చాడు- సినిమా చూపించాడు
హైదరాబాద్ సినీమాక్స్ పివిఆర్‌లో చిన్నారులతో కలిసి అవెంజర్స్ : ఎండ్ గేమ్ సినిమా చూసాడు సాయి ధరమ్ తేజ్..

హైదరాబాద్ సినీమాక్స్ పివిఆర్‌లో చిన్నారులతో కలిసి అవెంజర్స్ : ఎండ్ గేమ్ సినిమా చూసాడు సాయి ధరమ్ తేజ్..
వరల్డ్ వైడ్‌గా అవెంజర్స్ : ఎండ్ గేమ్ ఎంత సెన్షేషన్ క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ కోట్లాది రూపాయల కలెక్షన్లు కొల్లగొడుతుంది. రీసెంట్‌గా హైదరాబాద్‌లోని ఒక ఆశ్రమానికి చెందిన కొందరు చిన్నారులకు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అవెంజర్స్ : ఎండ్ గేమ్ స్పెషల్ షో వేయించాడు. హైదరాబాద్ సినీమాక్స్ పివిఆర్‌లో చిన్నారులతో కలిసి సినిమా చూసాడు తేజు. అతనితో పాటు, తమ్ముడు వైష్ణవ్ తేజ్, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.
‘పిల్లలు సినిమాని చాలాబాగా ఎంజాయ్ చేసారని, తన సినిమాలు అర్ధం చేసుకునే వయసు వాళ్ళకి లేదు కాబట్టి, సూపర్ హీరోస్ మూవీ చూపించానని, వాళ్ళతో కలిసి సినిమా చూడడం హ్యాపీగా ఉందనీ, తనపై వాళ్ళు చూపిస్తున్న ప్రేమను మాటల్లో చెప్పలేను’ అని సాయి ధరమ్ తేజ్ అన్నాడు.
Also Read : మంచు విష్ణు మానసికంగా వేధిస్తున్నాడు : ఓటర్ డైరెక్టర్