మెగాభిమానులకు ప్రేమతో.. సాయి ధరమ్ తేజ్ ‘గొప్పమనసు’

తన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నమెగాభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్..

  • Publish Date - October 15, 2019 / 09:40 AM IST

తన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నమెగాభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్..

అక్టోబర్ 15 సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఓ మంచి పనితో అందరి మనసులూ దోచుకోవడమే కాకుండా, మరెందరికో స్ఫూర్తిగా నిలిచాడు. మెగాభిమానులు తన బర్త్‌డే సందర్భంగా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వారికి థ్యాంక్స్ తెలిపాడు.

ట్విట్టర్‌లో ఒక అనాథశరణాలయం వాళ్లు తనను ట్యాగ్ చేస్తూ.. కన్‌స్ట్రక్షన్ కోసం తన హెల్ప్ అడిగారని, తను వారికి సహాయం చేస్తూనే.. తన బర్త్‌డేకి ఫ్లెక్సీలవీ వద్దని, ఆ అమౌంట్‌ని డొనేట్ చెయ్యమని మెగా ఫ్యాన్స్‌ని కోరగా.. వారు భారీ మొత్తంలో డొనేట్ చేశారని వారిని అభినందించాడు తేజ్. 

Read Also : ‘రొమాంటిక్’ సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం

ఇక తన వంతుగా ఆ ఓల్డేజ్ హోమ్ సంవత్సరం పాటు రన్ అవడానికి సహాయం చేస్తున్నానని, తన పిలుపు మేరకు డొనేట్ చేసిన ఫ్యాన్స్ అందరకీ కృతజ్ఞతలు తెలిపాడు తేజు.. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’, సుబ్బు దర్శకత్వంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలు చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్.