Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం.. ఆ స్పోర్ట్స్ బైక్ ఇదే.. ఖరీదు రూ.18లక్షలు

మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన వ

Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం.. ఆ స్పోర్ట్స్ బైక్ ఇదే.. ఖరీదు రూ.18లక్షలు

Sai Dharam Tej Bike

Updated On : September 11, 2021 / 12:11 AM IST

Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తేజ్ ను హైటెక్ సిటీలోని మెడీకవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిశాక తేజ్ కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, తేజ్ కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు.

శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లో ఈ ప్రమాదం జరిగింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటాక ఐకియా వైపు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు తెలిపారు. అక్కడ మట్టి, బురద ఉండటం వల్లనే స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదం జరిగినట్లు వివరించారు. తేజ్ బండి నెంబర్ TS07 GJ1258. తేజ్ ఇటీవలే ఈ స్పోర్ట్స్ బైక్ కొన్నాడు. ఆ బైక్ ఖరీదు రూ.18లక్షలు. అనిల్ కుమార్ పేరుతో బైక్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఈ స్పోర్ట్స్ బైక్ 1160 సీసీతో నడిచే ట్రంఫ్ బైక్. ఇది సరికొత్త బైక్. హై ఎండ్ బైక్ అని చెప్పాలి. చూడగానే ఆకట్టుకునే మోడల్. రేసింగ్ బైక్. 228 కేజీల బరువు ఉంటుంది. తేజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసినా, ఇంకా అపస్మారక స్థితిలోనే ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది.

తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బైక్ రైడింగ్ అంటే తేజ్ కు ఇష్టం. షూటింగ్ లేని సమయంలో తన బైక్ లేదా స్నేహితుల బైక్ తీసుకుని సరదాగా రైడింగ్ కు వెళతాడు. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా బైక్ రైడ్ చేస్తున్నాడు. కేబుల్ బ్రిడ్జి దాటాక బైక్ స్పీడ్ ని అదుపు చేయలేక కిందకు పడ్డాడు. ప్రమాదంలో గాయాలు అయ్యాయి.

ప్రమాదంపై మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు…
* ఐకియా సమీపంలో బైక్ స్కిడ్ అవ్వడం వల్ల ప్రమాదం జరిగింది.
* తేజ్ హెల్మెట్ ధరించాడు
* కుడివైపు పడిపోవడం వల్ల ఛాతి, కుడి కన్ను, కడుపు భాగంలో గాయాలయ్యాయి
* వెంటనే మెడికవర్ ఆసుపత్రికి తరలించాం
* ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నాం
* తేజ్ కు ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు
* తేజ్ ఇంకా స్పృహలో లేరు
* వైద్య పరీక్షలు జరుగుతున్నాయి
* రాత్రి 8.30 గంటలకు ప్రమాదం జరిగింది