Sai Dharam Tej : సినిమాలకు ఓకే చెప్పిన సాయి ధరమ్ తేజ్.. కొత్త సంవత్సరంలో షూటింగ్??

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కథలు వింటున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు ఓకే చేసినట్టు సమాచారం. కార్తీక్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఒక సినిమాని .......

Sai Dharam Tej : సినిమాలకు ఓకే చెప్పిన సాయి ధరమ్ తేజ్.. కొత్త సంవత్సరంలో షూటింగ్??

Sai Dharam Tej

Updated On : December 13, 2021 / 1:09 PM IST

Sai Dharam Tej :  మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రెండు నెలల క్రితం యాక్సిడెంట్ కి గురయ్యి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆ తర్వాత దాదాపు నెల రోజుల పాటు హాస్పిటల్ లోనే చికిత్స పొందారు. ఆయన చివరి సినిమా ‘రిపబ్లి’క్ రిలీజ్ టైంలో కూడా ఆయన హాస్పిటల్ లోనే ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక కూడా నెల రోజుల పాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత దీపావళి రోజు మెగా ఫ్యామిలిలో జరిగిన పార్టీతో బయటకి వచ్చాడు. యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ మళ్ళీ కనపడటం అదే మొదటి సారి. ఆ తర్వాత కూడా మళ్ళీ కనపడలేదు.

అయితే సాయి ధరమ్ తేజ్ కోలుకున్నా ఇంకా సినిమా షూటింగ్స్ కి సహకరించే విధంగా తయారవ్వలేదని సమాచారం. మరిన్ని రోజులు హెల్త్ మీద ఏకాగ్రత పెట్టి ఇదివరకు లాగా ఫుల్ హెల్తీగా తయారయ్యాకే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడంట. అందుకోసం తన బాడీని బాగా ట్రైన్ కూడా చేస్తున్నాడు. మంచి ఫుడ్ తీసుకోవడం, జిమ్, యోగా చేయడం లాంటివి చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్.

Vicky katrina : బయటకొచ్చిన విక్కీ-కత్రినా పెళ్లి వేడుకల ఫోటోలు

ఇక ‘రిపబ్లిక్’ తర్వాత ఒక సినిమా ఒప్పుకున్నా ఈ యాక్సిడెంట్ వల్ల అది క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కథలు వింటున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు ఓకే చేసినట్టు సమాచారం. కార్తీక్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఒక సినిమాని ఓకే చేసినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక సమాచారం రానుందని తెలుస్తోంది. అంతేకాక తన బావ వరుణ్ తేజ్ తో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేసే ప్లాన్ లో సాయి ధరమ్ తేజ్ ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధం అయిపోయిందని సమాచారం.

Dil Raju : హలో గురు ప్రేమ కోసమే అంటూ సింగర్‌గా మారిన దిల్ రాజు.. వైరల్ అవుతున్న వీడియో

ఇలా బ్యాక్ టు బ్యాక్ కథలు వింటూ సినిమాలు ఓకే చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. కొత్త సంవత్సరం 2022లో కొత్తగా తన నెక్స్ట్ సినిమాలు అనౌన్స్ చేసి షూటింగ్ మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నాడు ఈ సుప్రీం హీరో. 2022 సమ్మర్ వరకు సాయి ధరమ్ తేజ్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.