Virupaksha Collections : కలెక్షన్స్‌లో మొదటిరోజుని మించిన సెకండ్ డే.. యూఎస్‌లో కూడా దూకుడు!

సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. ఒక తెలుగులోనే ఇంతంటే..

Sai Dharam Tej Virupaksha second Collections is more than first day

Virupaksha Collections : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), సంయుక్త (Samyuktha) హీరోహీరోయిన్లుగా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా విరూపాక్ష. కొత్త దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కించగా టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు. మిస్టిక్ హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా థియేటర్ ఆడియన్స్ ని భయపెడుతూ అలరిస్తుంది. మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ అందుకోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద విరూపాక్ష జైత్ర యాత్ర మొదలైంది.

Virupaksha : సినిమా హిట్టు అనుకునేలోపే దర్శకనిర్మాతలకు బిగ్ షాక్.. ఏమైంది?

ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. తాజాగా సెకండ్ డే కలెక్షన్స్ ని కూడా ప్రకటించారు. రెండు రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా రూ.28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. మొదటి రోజు కంటే 6 కోట్లు ఎక్కువ సాధించడం ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు. యూఎస్‌లో కూడా ఇదే దూకుడు మెయిన్‌టైన్ చేస్తుంది. ఇప్పటి వరకు యూఎస్‌ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 350K డాలర్లు రాబట్టినట్లు మేకర్స్ తెలియజేశారు.

South Industry : ఇండియన్‌ మూవీ రెవెన్యూలో సౌత్ సినిమాల షేర్ తెలిస్తే షాక్..

కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది కేవలం తెలుగులో మాత్రమే. పాన్ ఇండియా కంటెంట్ ఉన్నా కేవలం తెలుగులోనే రిలీజ్ చేశారు. ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తామంటూ మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ కి ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తే కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయం అంటున్నారు. మరి ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.