Virupaksha : సినిమా హిట్టు అనుకునేలోపే దర్శకనిర్మాతలకు బిగ్ షాక్.. ఏమైంది?
థియేటర్ లో విరూపాక్ష రెస్పాన్స్ చూసేందుకు వెళ్లిన నిర్మాత ప్రసాద్, దర్శకుడు కార్తీక్ కి షాక్ తగిలింది. అసలు ఏమైందంటే..

Virupaksha director and producer phone and purse robbed
Virupaksha : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని కమ్‌బ్యాక్ ఇచ్చిన సినిమా విరూపాక్ష. కొత్త దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రొడక్షన్స్ లో బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మించగా కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈ శుక్రవారం (ఏప్రిల్ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో తోనే సూపర్ హిట్ ని సొంత చేసుకుంది.
Pawan Kalyan OG : పవన్ అభిమానికి OG నిర్మాత డివివి బిర్యానీ పార్సిల్.. ఫోటో వైరల్!
కాగా థియేటర్ లో మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసేందుకు నిర్మాత ప్రసాద్, దర్శకుడు కార్తీక్ హైదరాబాద్ లోని పలు థియేటర్ లను సందర్శించారు. ఇక ఈ ప్రయాణంలో కార్తీక్ ఫోన్ చోరీకి గురైందట. అలాగే నిర్మాత ప్రసాద్ పర్సు కూడా కొట్టేశారని తెలుస్తుంది. అయితే ప్రయాణంలో ఈ రెండు ఎక్కడ మిస్ అయ్యాయో తెలియకపోవడంతో పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్లకూడదని దర్శకనిర్మాత భావించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Virupaksha : విరూపాక్ష సక్సెస్ పై రామ్ చరణ్ రియాక్షన్.. ట్వీట్ వైరల్!
ఇక విరూపాక్ష సక్సెస్ విషయానికి వస్తే.. మొదటి రోజే రూ.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి సాయి ధరమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. US బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల జోరు చూపిస్తుంది. ఫస్ట్ డే 200K డాలర్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టినట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగులో మాత్రమే రిలీజ్ చేసిన ఈ చిత్రాన్ని త్వరలో ఇతర భాషల్లో కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ సక్సెస్ తో మెగా ఫ్యామిలీ ఫుల్ జోష్ లో ఉంది.