Sai Dharam Tej
Sai Dharm Tej : టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ హాస్పిటల్ లో కోలుకుంటున్నారు. గత నెల 12న హైదరాబాద్ మాదాపూర్ లో బైక్ యాక్సిడెంట్ లో గాయపడినప్పటి నుంచి.. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు సాయిధరమ్ తేజ్. ఆయన ఆరోగ్యం ఎలా ఉందోనన్న ఆందోళన అభిమానుల్లో ఉండేది. ఐతే.. దాదాపు 3 వారాల తర్వాత సాయిధరమ్ తేజ్… ట్విట్టర్ లో స్పందించారు. విక్టరీ సింబల్ మాత్రమే చూపిస్తూ… ఓ ఫొటోను షేర్ చేశారు సాయితేజ్.
Read This : Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం.. యాక్సిడెంట్ దృశ్యాలు విడుదల
సెప్టెంబర్ పదో తేదీన చివరిసారి సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ లో స్పందించారు. వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పిన పోస్ట్ అది. ఆ తర్వాత.. సాయితేజ్ స్పందించడం ఇదే తొలిసారి. “నా మీద, నా సినిమా Republic మీద… మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయతకు ధన్యవాదాలు చెప్పడం అనేది చాలా తక్కువే. త్వరలోనే మిమ్మల్ని అందరినీ కలుస్తా” అని సాయితేజ్ ఓ మెసేజ్ ను కూడా పోస్ట్ చేశారు.