Sai Durgha Tej Special Post on Chiranjeevi and Pawan Kalyan Success
Sai Durgha Tej – Chiranjeevi – Pawan Kalyan : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి మామయ్యలు అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. మామయ్యలకు కూడా తేజ్ అంటే చాలా అభిమానం. ఇక మెగాస్టార్, పవర్ స్టార్ ఏదైనా కొత్తగా సాధిస్తే ముందుగా సంతోషం వ్యక్తం చేస్తూ స్పందించేది సాయి దుర్గ తేజ్.
ఇటీవల పవన్ కళ్యాణ్ ఎన్నికలో గెలిచినప్పుడు తేజ్ పవన్ ని ఎత్తుకొని హడావిడి చేసాడు. ఫ్యామిలీ సెలెబ్రేషన్స్ లో విజిల్స్ వేస్తూ సందడి చేసిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి విజిల్స్ వేసి సందడి చేసాడు తేజ్. నిన్న చిరంజీవి తన డ్యాన్స్ కు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించారు. ఈ ఈవెంట్ ఘనంగా జరగగా ఈవెంట్ కు పలువురు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. సాయి తేజ్ కూడా హాజరయ్యాడు. చిరంజీవి ఆ రికార్డు అందుకునేటప్పుడు విజిల్స్ వేస్తూ సందడి చేసాడు తేజ్.
అలాగే ఇటీవల పవన్ ఎన్నికల్లో గెలిచినప్పటి సెలబ్రేషన్స్, చిరంజీవి గిన్నిస్ రికార్డ్ వీడియోలను కలిపి షేర్ చేసి.. నా సంతోషం.. నా ఆనందం.. నా మామయ్యల విజయం… అంటూ పోస్ట్ చేసాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. తేజ్ కి తన మామయ్యలు అంటే ఎంత ఇష్టమో మరోసారి చూపించాడు.
ఇక మెగాస్టార్ చిరంజీవికి కంగ్రాట్స్ చెప్తూ.. డ్యాన్స్ అంటే చిరంజీవి గారు.. చిరంజీవి గారు అంటే డ్యాన్స్.. ఊహ తెలిసాక నాకు తెలిసిన హీరో చిరంజీవి గారే.. డ్యాన్స్ అంటే ఆయన స్టెప్పులే.. ఆ నాట్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడం అరుదైన ఘట్టం.. అంటూ పోస్ట్ చేసారు. దీంతో మరోసారి తేజ్ ని మెగా ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.
డ్యాన్స్ అంటే చిరంజీవి గారు.. చిరంజీవి గారు అంటే డ్యాన్స్..
ఊహ తెలిసాక నాకు తెలిసిన హీరో చిరంజీవి గారే.. డ్యాన్స్ అంటే ఆయన స్టెప్పులే..ఆ నాట్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడం అరుదైన ఘట్టం..#GuinnessRecordForMEGASTAR #MegaGuinnessRecord pic.twitter.com/Y8ZmWcZqfA
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 22, 2024