Game Changer : ‘గేమ్ ఛేంజర్’లో రామ్‌చరణ్ నుంచి ఆర్ఆర్ఆర్‌కి మించిన వేరియేషన్స్ చూస్తారు..

ఆర్ఆర్ఆర్‌ మూవీలో రామ్ చరణ్ అనేక వేరియేషన్స్ లో చూసారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ లో అంతకుమించి వేరియేషన్స్ చూస్తారు అంటున్నారు రచయిత బుర్ర సాయి మాధవ్.

Game Changer : ‘గేమ్ ఛేంజర్’లో రామ్‌చరణ్ నుంచి ఆర్ఆర్ఆర్‌కి మించిన వేరియేషన్స్ చూస్తారు..

Sai Madhav Burra comments about Ram Charan Character in Game Changer

Updated On : February 27, 2024 / 7:28 PM IST

Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత మూడేళ్ళుగా చిత్రీకరణ జారుకుంటూనే ఉన్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మరో స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథని అందిస్తున్నారు. బుర్ర సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు. తాజాగా సాయి మాధవ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఆ మూవీకి పని చేసిన ప్రతి ఒక్కర్ని ఎలా పైకి తీసుకు వెళ్లిందో.. గేమ్ ఛేంజర్ కూడా ఆ మూవీ యూనిట్ లోని ప్రతి ఒక్కరికి అంతే పేరు తీసుకు వస్తుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అనేక వేరియేషన్స్ లో కనిపించబోతున్నారట.

Also read : Nani : ఆ దర్శకుడితో నాని సినిమా ఫిక్స్.. బర్త్ డే ఫోటోతో కన్ఫార్మ్ చేసేశారు..

మాస్, క్లాస్, రగ్డ్, హుందాగా.. ఇలా ఒక మనిషి జీవితంలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో. అని వేరియేషన్స్ లో రామ్ చరణ్ కనిపిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన అభిమానుల్లో.. మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. కాగా ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ఇక ఆ అప్డేట్ ని మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు నాడు ఇచ్చేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తుందట. మరి ఆ అప్డేట్ టీజర్ అవుతుందా..? లేదా గతంలో రిలీజ్ చేస్తామంటూ ప్రకటించి క్యాన్సిల్ చేసిన ‘జరగండి’ సాంగ్ అప్డేట్ అవుతుందా అనేది చూడాలి. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, నాజర్, నవీన్ చంద్ర, సముద్రఖని, సునీల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.