Sai Marthand
Sai Marthand : మౌళి, శివాని జంటగా తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ సినిమా ఇటీవల రిలీజయి పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. కేవలం రెండున్నర కోట్లు పెట్టి తెరకెక్కించిన లిటిల్ హార్ట్స్ సినిమా ఏకంగా 32 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ ఒక్క సినిమాతో సినిమాకు పనిచేసిన వాళ్ళు, సినిమాలో నటించిన వాళ్ళు స్టార్స్ అయిపోయారు. లిటిల్ హార్ట్స్ సినిమాని సాయి మార్తాండ్ డైరెక్ట్ చేసాడు. ఇది అతనికి మొదటి సినిమా. కానీ సినిమా చూస్తే చాలా అనుభవం ఉన్న దర్శకుడు తీసినట్టు ఉంటుంది.
తాజాగా లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. హైదరాబాద్ లోని ఓ కాలేజీకి లిటిల్ హార్ట్స్ మూవీ టీమ్ తో కలిసి గెస్ట్ గా వెళ్ళాడు. అక్కడ ఆడిటోరియంలో స్టూడెంట్స్ తో దిగిన ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నేను సప్లీలు రాసిన కాలేజీ అని పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఎక్కడైతే సప్లీ ఎగ్జామ్స్ రాశాడో అక్కడే గెస్ట్ గా వెళ్ళాడు కదా అని నెటిజన్లు సాయి మార్తాండ్ ని అభినందిస్తూ ఇది కదా సక్సెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Priyanka Mohan : OG ప్రమోషన్స్ మొదలు పెట్టిన ప్రియాంక మోహన్.. సినిమా, పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పిందంటే..
సాయి మార్తాండ్ మల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ చేసాడు. అప్పుడు కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవ్వడంతో సప్లీల కోసం ఆ కాలేజీకి వెళ్లి ఎగ్జామ్స్ రాసాడు. ఇంజినీరింగ్ తర్వాత సినీ పరిశ్రమలోకి వచ్చిన సాయి మార్తాండ్ ఇప్పుడు దర్శకుడిగా సక్సెస్ అవ్వడంతో తను సప్లీలు రాసిన కాలేజీకి ఇలా గెస్ట్ గా వెళ్లడం గమనార్హం.