Sai Pallavi : ‘రామాయణ’ కంటే ముందే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. ఫస్ట్ సినిమా రిలీజ్ ఎప్పుడు? ఏ హీరోతో?

రామాయణ సినిమా కంటే ముందే సాయి పల్లవి మరో సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది.(Sai Pallavi)

Sai Pallavi

Sai Pallavi : సాయి పల్లవి సౌత్ లో మంచి మంచి సినిమాలు చేస్తూ బోలెడంతమంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. సాయి పల్లవి ఇటీవల తండేల్ సినిమాతో భారీ విజయం అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సరసన సాయి పల్లవి రామాయణ సినిమాలో సీత గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా 2026 దీపావళికి రిలీజ్ కానుంది.(Sai Pallavi)

అయితే రామాయణ సినిమా కంటే ముందే సాయి పల్లవి మరో సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తో కలిసి సాయి పల్లవి ఒక సినిమా చేస్తుంది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నట్టు సమాచారం. గతంలో ఈ సినిమా టైటిల్ ‘ఏక్ దిన్’ అని, సినిమాని నవంబర్ లో రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సినిమా టైటిల్, రిలీజ్ డేట్ మారాయి.

Also Read : Kishkindhapuri Sequel : ‘కిష్కింధపురి’ సినిమా చివర్లో షాక్ అవ్వాల్సిందే.. సీక్వెల్ లో ఒకప్పటి హీరోయిన్ మెయిన్ లీడ్..?

సాయి పల్లవి బాలీవుడ్ ఫస్ట్ సినిమా కొత్త టైటిల్ ‘మేరే రహో’ అని సమాచారం. ఆ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ కాబోతున్నట్టు బాలీవుడ్ సమాచారం. మరి సాయి పల్లవి బాలీవుడ్ లో మొదటి సినిమాతో అక్కడి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఇక ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఇప్పటికే లవ్ యాపా, మహారాజ సినిమాలతో హీరోగా పర్వాలేదనిపించాడు.