Sai Pallavi : స్టేజిపైనే ఏడ్చేసిన సాయి పల్లవి.. హగ్ చేసుకొని ఓదార్చిన నాని

మీరు చూపించే ఈ ప్రేమకి నాకు కన్నీళ్లు వచ్చేస్తున్నాయి అంటూ సాయిపల్లవి ఎమోషనల్‌ అయి ఏడ్చేశారు. ఆ తర్వాత మైక్ ఇచ్చేసి వెళ్లి నానిని హగ్ చేసుకొని ఏడ్చేసింది సాయి పల్లవి. నాని.....

Sai Pallavi

Sai Pallavi :   నాని హీరోగా కృతిశెట్టి, సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమాలో నాని రెండు పాత్రలు పోషించడం, అందులో ఒకటి 1970లో పాత్ర అవ్వడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది ప్రేక్షకులకి. ఈ సినిమా డిసెంబర్ 24న దక్షిణాది భాషల్లో రిలీజ్ అవ్వనుంది. తాజాగా నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ ఏడ్చేసింది.

సాయి పల్లవి మాట్లాడటం మొదలు పెట్టగానే అభిమానులు అరవడం, విజిల్స్ వేయడం, సాయి పల్లవి కోసం వారి అభిమానాన్ని చూపించడం చేశారు. ఇవన్నీ చూసి సాయి పల్లవి మాట్లాడుతూ… ”పూర్తిగా తెలుగులో మాట్లాడలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. ఈరోజు మీ అందరూ నాపైన చూపిస్తున్న ప్రేమాభిమానాలకి నేను ఎమోషనల్ అవుతున్నాను. ఈ సినిమా గురించి ఎంతో చెప్పాలని ఉన్నా భావోద్వేగంతో మాటలు రావడం లేదు. నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ ఇండస్ట్రీకి, నన్ను నమ్మి అవకాశాలు ఇస్తున్న దర్శకులందరికీ నా కృతజ్ఞతలు. నేనెంతో శ్రమించడం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని అందరూ అంటుంటారు. కానీ నేను ఏ సినిమాని కష్టంగా భావించి పని చేయలేదు. ఇష్టపడి ప్రతి పాత్రను ఎంజాయ్‌ చేస్తూ సినిమా చేశాను. నేను ఒకప్పుడు అనుకునేదాన్ని నేషనల్‌ అవార్డు అందుకున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటానని అనుకున్నాను. కానీ, ఒక నటిగా ఈ స్టేజ్‌పై ఉండటమే ఓ పెద్ద అవార్డని ఈరోజు అర్థమైంది. మీరు చూపించే ఈ ప్రేమకి నాకు కన్నీళ్లు వచ్చేస్తున్నాయి’’ అంటూ సాయిపల్లవి ఎమోషనల్‌ అయి ఏడ్చేశారు.

Pushpa : ‘పుష్ప’ పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన సుక్కు

ఆ తర్వాత మైక్ ఇచ్చేసి వెళ్లి నానిని హగ్ చేసుకొని ఏడ్చేసింది సాయి పల్లవి. నాని ఆమెని ఓదార్చే ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత డైరెక్టర్ కూడా సాయి పల్లవి గురించి మాట్లాడినప్పుడు కూడా ఫాన్స్ అంతా మరోసారి అరవడంతో సాయి పల్లవి మళ్ళీ ఆనందంతో ఎమోషనల్ అయింది. దీంతో సాయి పల్లవి స్టేజిపైన ఏడ్చిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.