Sai Pallavi Decides To Act In Web Series
Sai Pallavi: అందాల భామ సాయి పల్లవి చాలా నెమ్మదిగా సినిమాలను సెలెక్ట్ చేస్తోంది. గతంలో లవ్ స్టోరి, విరాటపర్వం, గార్గి వంటి బ్యాక టు బ్యాక్ సినిమాల్లో నటించిన సాయి పల్లవి, ఇప్పుడు ఒక్క సినిమాను కూడా సైన్ చేయలేదు. దీంతో అభిమానులు ఆమె సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.
Sai Pallavi: రిపబ్లిక్ డే కానుకగా సాయి పల్లవి మూవీ.. ఆసక్తిగా చూస్తున్న ఆడియెన్స్!
అయితే, ఇటీవల ఫిలిం సర్కిల్స్‌లో సాయి పల్లవి సినిమాల నుంచి తప్పుకోనుందని.. ఆమె డాక్టర్ వృత్తిలో స్థిరపడాలని చూస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ, ఈ వార్తలపై ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. ఇక ఇప్పుడు సాయి పల్లవి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తోంది. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయబోతున్న ఈ వెబ్ సిరీస్‌లో సాయి పల్లవి నటించేందుకు ఓకే చెప్పిందట.
Sai Pallavi : పుట్టపర్తిలో సాయి పల్లవి.. దైవ చింతనలో న్యూ ఇయర్ వేడుకలు..
కాగా, ఈ విషయంపై ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాకపోవడంతో, నిజంగానే సాయిపల్లవి ఈ మేరకు నిర్ణయం తీసుకుందా అనే ఆసక్తి అభిమానుల్లో క్రియేట్ అయ్యింది.