Sai Pallavi: రిపబ్లిక్ డే కానుకగా సాయి పల్లవి మూవీ.. ఆసక్తిగా చూస్తున్న ఆడియెన్స్!

లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి సినిమా వస్తుందంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆమె నటించే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎక్కవగా సక్సెస్ అవుతుండటంతోనే ఆమెకు సౌత్‌లో అదిరిపోయే ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. ఇక గ్లామర్‌కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా, కేవలం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ.

Sai Pallavi: రిపబ్లిక్ డే కానుకగా సాయి పల్లవి మూవీ.. ఆసక్తిగా చూస్తున్న ఆడియెన్స్!

Sai Pallavi Gargi Movie World Television Premiere Date Locked

Updated On : January 20, 2023 / 9:54 PM IST

Sai Pallavi: లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి సినిమా వస్తుందంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆమె నటించే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎక్కవగా సక్సెస్ అవుతుండటంతోనే ఆమెకు సౌత్‌లో అదిరిపోయే ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. ఇక గ్లామర్‌కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా, కేవలం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ.

Sai Pallavi : పుట్టపర్తిలో సాయి పల్లవి.. దైవ చింతనలో న్యూ ఇయర్ వేడుకలు..

అయితే ఈ రిపబ్లిక్ డే రోజున సాయి పల్లవి నటించిన ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు, సాయి పల్లవి ఏ సినిమా చేసింది.. ఇంతలోనే ఆమె నటించిన ఏ సినిమా రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారా.. అసలు విషయం ఏమిటంటే.. సాయి పల్లవి నటించిన లాస్ట్ మూవీ ‘గార్గి’ గురించి అందరికీ తెలిసిందే. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేశారు. తమిళ బాక్సాఫీస్ వద్ద మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అసలు గార్గి అనే సినిమా వచ్చిందని చాలా మంది అభిమానులకు కూడా తెలియదు.

Sai Pallavi: డ్యాన్స్ షోలపై సాయి పల్లవి హాట్ కామెంట్స్.. ఏమందంటే?

దీంతో ఇప్పుడు ఈ సినిమాను బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జనవరి 26న స్టార్ మా ఛానల్‌లో టెలికాస్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో మరోసారి గార్గి చిత్రం ట్రెండింగ్ అవుతోంది. సాయి పల్లవి నటించిన ఈ సినిమాను గౌతమ్ రామచంద్రన్ డైరెక్ట్ చేయగా, కాళి వెంకట్, ఐశ్వర్య లక్ష్మీ, ఆర్ఎస్.శివాజి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ‘96’ మూవీ ఫేం గోవింద్ వసంత ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. మరి బుల్లితెరపై సాయిపల్లవి మూవీకి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.