Sai Pallavi: డ్యాన్స్ షోలపై సాయి పల్లవి హాట్ కామెంట్స్.. ఏమందంటే?

‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి, ఆ సినిమాతో ఎక్కడలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కేవలం ఒక్క సినిమాతోనే అమ్మడికి టాలీవుడ్ అభిమానులు పట్టం కట్టారు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో డ్యాన్స్ షోల పై పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

Sai Pallavi: డ్యాన్స్ షోలపై సాయి పల్లవి హాట్ కామెంట్స్.. ఏమందంటే?

Sai Pallavi Comments On Dance Shows Goes Viral

Sai Pallavi: ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి, ఆ సినిమాతో ఎక్కడలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కేవలం ఒక్క సినిమాతోనే అమ్మడికి టాలీవుడ్ అభిమానులు పట్టం కట్టారు. ఇక ఆ తరువాత ఆమె టాలీవుడ్‌లో చేసిన సినిమాలు, ఆమె నేచురల్ యాక్టింగ్, లుక్స్ ఆమెను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. అయితే ఈ బ్యూటీ ఇటీవల చాలా వైవిధ్యమైన సబ్జెక్టులు ఎంచుకుంటూ వస్తోంది.

Sai Pallavi: “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” అంటున్న.. సాయి పల్లవి!

కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ అమ్మడు సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది. అయితే సాయి పల్లవి గ్లామర్ షోకు ససేమిరా చెప్పడంతో ఆమె చాలా తక్కువగా సినిమాలు చేస్తూ వస్తోంది. అయినా కూడా తన కెరీర్‌లో గ్లామర్ షోకు తావు లేకుండా ఉండే పాత్రలే చేస్తానంటూ ఈ బ్యూటీ దూసుకెళ్తోంది. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో డ్యాన్స్ షోల పై పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఉన్న డ్యాన్స్ షోలపై తనకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని.. కేవలం డబ్బు, పరపతి ఉన్న కిడ్స్‌కే డ్యాన్స్ షోస్‌లో అవకాశం, అవార్డులు ఇస్తున్నారని ఆమె తెలిపింది.

Sai Pallavi : బోనమెత్తిన సాయి పల్లవి.. వైరల్ అవుతున్న ఫొటో..

ప్రస్తుతం సాయి పల్లవి చేసిన కామెంట్స్‌పై కొందరు డ్యాన్సర్లు మండిపడుతున్నారు. ఒకప్పుడు సాయి పల్లవి కూడా డ్యాన్స్ షోలలో పాల్గొన్న విషయాన్ని ఆమె మర్చిపోయినట్లు ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు సరికొత్త వివాదానికి సాయి పల్లవి తెరలేపిందంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.