Sai Pallavi: “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” అంటున్న.. సాయి పల్లవి!

సాయి పల్లవి.. తెలుగునాట ఈ హీరోయిన్ కి ఉన్న క్రేజ్ మరే స్టార్ హీరోయిన్ కి లేదు. అలాని ఈమె స్టార్ హీరోల సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్లు ఇవ్వనూలేదు, కుర్రకారుని పిచ్చెక్కించేలా అందాల ఆరబోత కూడా చేయనూలేదు. కేవలం తన నటనతో, డాన్సులతో తెలుగునాట "లేడీ పవర్ స్టార్"గా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.

Sai Pallavi: “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” అంటున్న.. సాయి పల్లవి!

Sai Pallavi Winning Two Filmfare awards

Sai Pallavi: సాయి పల్లవి.. తెలుగునాట ఈ హీరోయిన్ కి ఉన్న క్రేజ్ మరే స్టార్ హీరోయిన్ కి లేదు. అలాని ఈమె స్టార్ హీరోల సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్లు ఇవ్వనూలేదు, కుర్రకారుని పిచ్చెక్కించేలా అందాల ఆరబోత కూడా చేయనూలేదు. కేవలం తన నటనతో, డాన్సులతో తెలుగునాట “లేడీ పవర్ స్టార్”గా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.

Sai Pallavi : బోనమెత్తిన సాయి పల్లవి.. వైరల్ అవుతున్న ఫొటో..

చిత్రసీమలో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డుల పురస్కారం ఇటీవల నిర్వహించగా.. సాయి పల్లవికి ఒకే సంవత్సరానికి గాను రెండు అవార్డులను కైవసం చేసుకుంది. నాగచైతన్యతో నటించిన లవ్ స్టోరీ సినిమాకు “ఉత్తమ నటిగా”, నానితో నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాకు గాను క్రిటిక్స్ “బెస్ట్ ఫిమేల్ యాక్టర్”గా మరో అవార్డును అందుకుంది.

ఈ ఆనందాన్ని తన సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ.. “ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు. ఒకే సంవత్సరం రెండు చిత్రాలకు ప్రశంసలు అందుకోవడం, చాలా ప్రత్యేకం. ఈ పాత్రల పట్ల మీరు చూపించిన అభిమానం, నన్ను ఇలాంటి మరెన్నో పాత్రలను ఎన్నుకునేలా చేస్తుంది” అంటూ అవార్డులతో దిగిన సెల్ఫీ ని షేర్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)