Site icon 10TV Telugu

Sai Pallavi : రామాయణ కంటే ముందే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ‘సాయి పల్లవి’.. స్టార్ హీరో కొడుకు సరసన.. రిలీజ్ డేట్ అనౌన్స్..

Sai Pallavi Entry into Bollywood with Aamir Khan son Junaid Khan Movie EK Din Release Date Announced

Sai Pallavi

Sai Pallavi : సాయి పల్లవి సౌత్ లో ఇప్పటికే తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. సాయి పల్లవి బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సరసన రామాయణ సినిమాలో సీత గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా 2026 దీపావళికి రిలీజ్ కానుంది.

అయితే దానికంటే ముందే సాయి పల్లవి మరో సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది.

Also Read : RK Sagar – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని మొదటిసారి కలిసినప్పుడు.. అలాంటివాళ్లే జనసేనలో చేరాలి..

సాయి పల్లవి బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తో కలిసి ఒక సినిమా చేస్తుంది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. సాయి పల్లవి బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సినిమా టైటిల్ ‘ఏక్ దిన్’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఏక్ దిన్ సినిమా ఈ సంవత్సరం నవంబర్ 7న రిలీజ్ కానుంది.

మరి ఈ సినిమాతో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఇప్పటికే లవ్ యాపా, మహారాజ సినిమాలతో హీరోగా మెప్పించాడు.

Also Read : Bhairavam : ఓటీటీలోకి వచ్చేస్తున్న భైరవం.. ఎప్పుడు? ఎందులో?

Exit mobile version