RK Sagar – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని మొదటిసారి కలిసినప్పుడు.. అలాంటివాళ్లే జనసేనలో చేరాలి..
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

RK Sagar Pawan Kalyan
RK Sagar – Pawan Kalyan : మొగలి రేకులు ఫేమ్ RK సాగర్ హీరోగా ది 100 అనే సినిమాతో జులై 11న రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
సాగర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి మొదటిసారి ఒక నిర్మాత తీసుకెళ్లారు. అప్పుడు ఆయన బుక్స్ చదువుకుంటూ ఉన్నారు. నన్ను చూసి మీరా మీకు మా అమ్మ పెద్ద ఫ్యాన్ అనుకుంటూ లేచి వచ్చి హగ్ చేసుకున్నారు. నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఆ తర్వాత జనసేనలో చేరి ప్రచార కమిటీ కార్యదర్శిగా, స్టార్ క్యాంపైనర్ గా చేసా. ఒక మనిషి ఎలా బతకాలి, సొసైటీకి ఏం ఇవ్వాలి అని ఆయన నుంచి నేర్చుకున్నా. ఆయనతో స్పెండ్ చేసే చాలా సమయం నాకొచ్చింది. నాకు పదవులు కావాలి అని లేదు. ఏమి ఆశించట్లేదు. జనాలకు ఏమైనా చేయాలి అనే జాయిన్ అయ్యాను. ఆ పార్టీ లోకి వచ్చేవాళ్లు కూడా అలాగే ఉండాలి అని అన్నారు.
Also Read : Bhairavam : ఓటీటీలోకి వచ్చేస్తున్న భైరవం.. ఎప్పుడు? ఎందులో?
సాగర్ ప్రస్తుతం జనసేన పార్టీలో తెలంగాణలో కీలక వ్యక్తిగా కూడా ఉన్నారు. గతంలో ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపైనర్ గా ప్రచార బాధ్యతలు తీసుకొని జనసేన పార్టీ కోసం పనిచేసారు.