Sai Pallavi
Sai Pallavi : మంచి మంచి సినిమాలతో సాయి పల్లవి సౌత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. చివరగా సాయి పల్లవి తండేల్ సినిమాతో గత సంవత్సరం ప్రేక్షకులను మెప్పించింది. ఇన్నాళ్లు సౌత్ లో సినిమాలు చేసిన సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది.(Sai Pallavi)
సాయి పల్లవి బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సరసన రామాయణ సినిమాలో సీత గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా మొదటి పార్ట్ 2026 దీపావళికి రిలీజ్ కానుంది. రామాయణ తో పాటు సాయి పల్లవి బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తో ఒక సినిమా చేసింది.
Also Read : Malavika Mohanan : ప్రభాస్ సినిమా పోయిందని బాధపడ్డా.. నన్నూ ప్రభాస్ ను కలిపింది అదే..
సాయి పల్లవి, జునైద్ ఖాన్ జంటగా నటించిన ‘మేరే రహో’ సినిమా ఈ సంవత్సరమే రిలీజ్ అవ్వాలి. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. ఈ సినిమాకు ఆమీర్ ఖాన్ నిర్మాత. అయితే ఇటీవల డిసెంబర్ లో కూడా రిలీజ్ చేద్దామనుకున్నా అమీర్ ఖాన్ మళ్ళీ వాయిదా వేసి 2026 సమ్మర్ కి మార్చారు.
దీంతో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆమె ఫ్యాన్స్ ఇంకెంత కాలం వెయిట్ చేయాలి అని అడుగుతున్నారు. అమీర్ ఖాన్ ఈ సినిమా రిలీజ్ ని ఎందుకు ఆపుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే బాలీవుడ్ లో వేరే సినిమాలు ఉండటం, ఈ సినిమా బిజినెస్ ఇంకా పూర్తిగా అవ్వకపోవడం వల్లే అమీర్ ఖాన్ ఈ సినిమా రిలీజ్ ని వాయిదా వేస్తున్నాడని బాలీవుడ్ సమాచారం.
Also See : Dil Raju : భార్య, కొడుకుతో కలిసి దిల్ రాజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. దుబాయ్ లో వెకేషన్.. ఫొటోలు..
ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఇప్పటికే లవ్ యాపా, మహారాజ సినిమాలతో హీరోగా మెప్పించాడు. మరి 2026 సమ్మర్ కి అయినా సాయి పల్లవి బాలీవుడ్ మొదటి సినిమా మేరే రహో రిలీజ్ అవుతుందా చూడాలి.