Malavika Mohanan : ప్రభాస్ సినిమా పోయిందని బాధపడ్డా.. నన్నూ ప్రభాస్ ను కలిపింది అదే..

రాజాసాబ్ సినిమాతో మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది మాళవిక మోహనన్. (Malavika Mohanan)

Malavika Mohanan : ప్రభాస్ సినిమా పోయిందని బాధపడ్డా.. నన్నూ ప్రభాస్ ను కలిపింది అదే..

Malavika Mohanan

Updated On : January 2, 2026 / 10:50 AM IST

Malavika Mohanan : మలయాళీ భామ మాళవిక మోహనన్ తమిళ్, మలయాళ సినిమాలతో ఫేమ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేసి తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరైంది. ప్రస్తుతం మాళవిక మోహనన్ ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో నటించింది.(Malavika Mohanan)

రాజాసాబ్ సినిమాతో మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది మాళవిక మోహనన్. రాజాసాబ్ సినిమా జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాళవిక మోహనన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపింది.

Also See : Dil Raju : భార్య, కొడుకుతో కలిసి దిల్ రాజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. దుబాయ్ లో వెకేషన్.. ఫొటోలు..

మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. సలార్ సినిమాలో మొదట నాకే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో శృతిహాసన్ చేసిన పాత్ర కోసం మొదట నన్నే అడిగారు. నేను వెళ్లి ప్రశాంత్ నీల్ ని కలిసాను కూడా. ఆల్మోస్ట్ ఆ సినిమా చేసేస్తాను అనుకున్నా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయాను. అప్పుడు చాలా బాధపడ్డాను.

ప్రభాస్ సలార్ సినిమా ఛాన్స్ పోయినందుకు బాధపడ్డాను. సలార్ ఛాన్స్ మిస్ అయిన కొన్ని నెలలకు రాజాసాబ్ ఛాన్స్ వచ్చింది. అప్పుడు చాలా సంతోషపడ్డాను. ప్రభాస్ ని – నన్ను ప్రకృతి కలిపింది. మా ఇద్దర్ని విధి కలిపింది అనుకుంటాను అని చెప్పుకొచ్చింది. మరి రాజాసాబ్ లో మాళవిక మోహనన్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

Also Read : Vijay Deverakonda : పాపం విజయ్ ఫ్యాన్స్.. కింగ్డమ్ 2 సినిమా అప్డేట్..