Sai Pallavi : వామ్మో.. ‘సీత’కి అన్ని కోట్ల రెమ్యునరేషన్.. సాయి పల్లవి దశ తిరిగిందిగా..

అలాంటి సాయి పల్లవికి రెమ్యునరేషన్ కూడా భారీగానే వస్తుందిగా.

Sai Pallavi

Sai Pallavi : సాయి పల్లవి చేసింది తక్కువ సినిమాలైనా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీగా సంపాదించుకుంది. సాయి పల్లవి పేరు చెప్తే కూడా థియేటర్స్ లో టికెట్లు తెగుతాయి. టాలీవుడ్ లో అయితే ఆమె ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఏకంగా లేడీ పవర్ స్టార్ అనిపించుకుంటుంది. మరి అలాంటి సాయి పల్లవికి రెమ్యునరేషన్ కూడా భారీగానే వస్తుందిగా.

ఇప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్స్ అంతా 2 నుంచి 3 కోట్ల వరకు టాలీవుడ్ లో తీసుకుంటున్నారు. బాలీవుడ్ కి వెళ్తే ఆ లెక్క పెరుగుతుంది. ఇప్పుడు సాయి పల్లవికి కూడా అదే జరిగింది. ఇన్నాళ్లు సౌత్ లో మెప్పించిన సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. జునైద్ ఖాన్ తో ఒక సినిమా చేస్తుండగా అది ఈ సంవత్సరం నవంబర్ లో రిలీజ్ అవ్వనుంది.

Also Read : Renu Desai : రేణు దేశాయ్ కి సర్జరీ.. ఏం సర్జరీ జరిగింది?

ఆ సినిమా తర్వాత రణబీర్ కపూర్ సరసన రామాయణ సినిమాలో సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణాన్ని గొప్పగా తెరకెక్కిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2026 లో మొదటి పార్ట్, 2027 లో రెండో పార్ట్ రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాకు సాయి పల్లవి రెమ్యునరేషన్ చర్చగా మారింది.

సాయి పల్లవి చివరి సినిమా తండేల్ పెద్ద హిట్ అయింది. ఈ సినిమాకు సాయి పల్లవి 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. అయితే బాలీవుడ్ లో రామాయణ సినిమాకు రెండు పార్టులకు కలిపి సాయి పల్లవి ఏకంగా 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఒక్కో పార్ట్ కి 6 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటుందని బాలీవుడ్ మీడియా అంటుంది. ఈ లెక్కన రామాయణ సినిమాకు సాయి పల్లవికి భారీగానే ముడుతుంది. బాలీవుడ్ లో సాయి పల్లవి చేసే ఈ సినిమాలు హిట్ అయితే అక్కడ కూడా సాయి పల్లవికి తిరుగు లేనట్టే.

Also Read : Oh Bhama Ayyo Rama : ‘ఓ భామ అయ్యో రామ’ రివ్యూ.. సుహాస్ కొత్త సినిమా ఎలా ఉంది?