×
Ad

Sai Pallavi : సీత పాత్రకు ఈమెని రిజెక్ట్ చేసి.. సాయి పల్లవిని తీసుకున్నారట.. పాపం రామాయణం మిస్ అయింది..

ఈ సినిమాలో సీత పాత్రకు ముందు వేరే హీరోయిన్ ని అనుకున్నారట. ఆడిషన్ కూడా తీసుకున్నారట.(Sai Pallavi)

Sai Pallavi

Sai Pallavi : బాలీవుడ్ లో రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా రామాయణం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారి దర్శకత్వంలో రెండు పార్టులుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ రామాయణంలో వివిధ పాత్రల్లో బాలీవుడ్ లోని చాలా మంది స్టార్స్ నటిస్తున్నారని సమాచారం. రావణాసురుడిగా కేజిఎఫ్ యశ్ నటిస్తున్నాడు.(Sai Pallavi)

అయితే ఈ సినిమాలో సీత పాత్రకు ముందు వేరే హీరోయిన్ ని అనుకున్నారట. ఆడిషన్ కూడా తీసుకున్నారట. కానీ చివరకు సాయి పల్లవిని తీసుకున్నారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రీనిధి శెట్టి. కేజిఎఫ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. ఇటీవల నానితో కలిసి హిట్ 3 సినిమాలో మెప్పించింది. త్వరలో తెలుసు కదా అనే సినిమాతో రాబోతుంది.

Also Read : Panjaram : ‘పంజరం’ హారర్ సినిమా ట్రైలర్ రిలీజ్..

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపింది. శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. బాలీవుడ్ రామాయణం సినిమా సీత పాత్రకు నన్ను ఆడిషన్ తీసుకున్నారు. నేను వెళ్లి ఆడిషన్ ఇచ్చాను. మూడు పేజీల డైలాగ్స్ కూడా చెప్పాను. కానీ నన్ను సెలెక్ట్ చేసుకోలేదు. చివరకు ఆ ఛాన్స్ సాయి పల్లవి గారికి వెళ్ళింది. నన్ను ఆడిషన్ తీసుకునేటప్పటికే ఆ సినిమాలో ఆల్మోస్ట్ అందర్నీ సెలెక్ట్ చేసుకున్నారు అని తెలిపింది.

దీంతో బాలీవుడ్ రామాయణం సినిమాలో సీతగా మంచి పాత్ర మిస్ అయింది శ్రీనిధి శెట్టికి అని ఆమె ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక రామాయణం సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావ‌ళికి రిలీజ్ కానుంది.

Also Read : Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ సరికొత్త రికార్డ్.. స్టార్ హీరోలందర్నీ వెనక్కి నెట్టేసి..